క‌డ‌ప ఉక్కు- మా హ‌క్కు

 

పులివెందుల‌:  కడప ఉక్కు- రాయ‌ల‌సీమ హక్కు అని వైయ‌స్ఆర్‌సీపీ సీనియ‌ర్ నేత వైయ‌స్ వివేకానంద‌రెడ్డి నిన‌దించారు. ఉక్కు ఫ్యాక్టరీ సాధనకు వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వ‌ర్యంలో గురువారం జిల్లా వ్యాప్తంగా బంద్‌ నిర్వహించారు. ఇందులో భాగంగా పులివెందుల‌లో వైయ‌స్ వివేకానంద‌రెడ్డి ఆధ్వ‌ర్యంలో బైక్ ర్యాలీ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ..  శాంతియుతంగా బంద్‌ చేస్తున్న నాయకులను అరెస్టు చేయడం దారుణమని పేర్కొన్నారు. ప్రభుత్వం రాయలసీమ అభివ అద్ధిని మర్చిపోయిందని విమర్శించారు. శాంతియుతంగా చేస్తున్న ఉద్యమాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని మండిపడ్డారు. ఇందుకు ప్రభుత్వం తగిన మూల్యం త్వరలోనే చెల్లించుకుంటుందని హెచ్చ‌రించారు..
Back to Top