ప్రత్యేక హోదాతోనే ఉద్యోగ‌, ఉపాధి అవ‌కాశాలు

ప‌శ్చిమ గోదావ‌రి: ప‌్ర‌త్యేక హోదాతోనే యువ‌త‌కు ఉద్యోగ‌, ఉపాధి అవ‌కాశాలు సాధ్య‌మ‌ని వైయ‌స్ఆర్‌సీపీ  ఆచంట నియోజకవర్గ సమన్వయకర్త కవురు శ్రీనివాసు  అన్నారు. జగనన్న స్పూర్తితో రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చే వరకు వైయ‌స్ఆర్‌సీపీ  కార్యకర్తలు, నేతలు మడమ తిప్పని పోరాటం కొనసాగించాలని పిలుపునిచ్చారు. మార్టేరులోని నాలుగు రోడ్ల కూడలిలో ప్రత్యేక హోదా కోరుతూ చేపట్టిన బంద్ లో ఆయ‌న‌ పాల్గొని మాట్లాడారు. ప్రత్యేక హోదా భావితరాల కోసం ఎంతో అవసరమన్నారు. భవిష్యత్‌లో పిల్లల విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం ప్రత్యేక హోదా అత్యవసరమన్నారు.
Back to Top