9న వైయ‌స్ఆర్‌సీపీ బూత్‌ కమిటీ కన్వీనర్ల సమావేశం

అనపర్తి (రాజ‌మండ్రి) :  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ  నియోజకవర్గ బూత్‌ కమిటీల క‌న్వీన‌ర్ల స‌మావేశం ఈ నెల 9న నిర్వహించనున్నట్టు పార్టీ నియోజకవర్గ కన్వీనర్‌ డాక్టర్‌ సత్తి సూర్యనారాయణరెడ్డి తెలిపారు. స్థానిక విలేకరులతో బుధవారం ఆయన మాట్లాడుతూ వర్తక సంఘం కల్యాణ మండలంలో 9వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం ప్రారంభమవుతుందన్నారు. `వైయ‌స్ఆర్ కుటుంబం’ కార్యక్రమం ప్రారంభం కానున్న నేపథ్యంలో ‘నవరత్నాలు’ పథకం ప్రచారంపై అవగాహన, కార్యక్రమం విజయవంతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చిస్తామన్నారు. నియోజకవర్గ పరిధిలోని అనపర్తి, బిక్కవోలు, పెదపూడి, రంగంపేట మండలాలకు చెందిన పోలింగ్‌ బూత్‌ కమిటీల కన్వీనర్లు అందరూ తప్పక హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు.

తాజా ఫోటోలు

Back to Top