అవిశ్వాస తీర్మానం మీద చర్చకు పిలిచే వరకు ఇక అసెంబ్లీకి వెళ్లేదే లేదు

హైదరాబాద్: కీలకమైన బడ్జెట్ సమావేశాల్లో కనీసం ప్రతిపక్షం ఏం చెబుతోందో వినే ఓపిక ప్రభుత్వానికి లేకపోవడం దారుణమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ అసెంబ్లీ విపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై తామిచ్చిన అవిశ్వాస తీర్మానం మీద చర్చకు పిలిచే వరకు ఇక అసెంబ్లీకి వెళ్లేది లేదని ఆయన స్పష్టం చేశారు. తనతో పాటు తమ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరూ.. అంటే మొత్తం ప్రతిపక్షం అసెంబ్లీకి అప్పటివరకు వెళ్లబోదని తెలిపారు. సభ నుంచి 8 మంది ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిన అనంతరం గవర్నర్ నరసింహన్ను కలిసిన ఆయన.. ఆ తర్వాత మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..
Back to Top