టీడీపీ విధానాల వల్లే ఉత్తరాంధ్ర వెనుకబాటు

– వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, ధర్మాన
–  బూత్‌ కమిటీ సభ్యుల సమావేశం ప్రారంభం
శ్రీకాకుళం: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రీకాకుళం జిల్లా బూత్‌ కమిటీ సభ్యుల సమావేశం కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ఎంపీ విజయసాయిరెడ్డి, సీనియర్‌ నాయకులు ధర్మాన ప్రసాదరావు, తదితరులు హాజరై ప్రసంగించారు. టీడీపీ విధానాల వల్లే ఉత్తరాంధ్ర వెనుకబడిపోయిందని వారు మండిపడ్డారు. నాలుగేళ్లు అయినా వంశధార ఫేజ్‌–2 పనులు ఎందుకు పూర్తి చేయలేకపోయారని ప్రశ్నించారు. అవినీతికి ప్రాధాన్యత ఇవ్వడం వల్లే ప్రాజెక్టులు పూర్తి కావడం లేదని ధ్వజమెత్తారు. చంద్రబాబు, లోకేష్‌ రూ.3 లక్షల కోట్ల అవినీతి డబ్బును విదేశాల్లో దాచుకున్నారని ఆరోపించారు. హోదా కోసం రాజీనామా చేసిన ఎంపీల స్థానాల్లో ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైయస్‌ఆర్‌సీపీ సిద్ధంగా ఉందని విజయసాయిరెడ్డి, ధర్మాన స్పష్టం చేశారు. 
 
Back to Top