రాష్ట్రం చీక‌టిమ‌యం

-  ఏపీలో కొన‌సాగుతున్న బిజిలీ బంద్‌
-   హోదాపై కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల తీరుకు నిరసన
-  రాత్రి 7 నుంచి 7.30 వరకు విద్యుత్‌ దీపాల ఆర్పివేత 

 అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాత్రి 7 గంట‌ల నుంచి చీక‌టిమ‌యం అయ్యింది. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు నిరసనగా రాష్ట్ర‌వ్యాప్తంగా  ‘బ్లాక్‌ డే (బిజిలీ బంద్‌)’గా పాటిస్తున్నారు. వైయ‌స్ఆర్‌సీపీ,  ప్రత్యేక హోదా సాధన సమితి, వామ‌ప‌క్షాల నాయ‌కులు కొవ్వొత్తుల‌తో ప్ర‌ద‌ర్శ‌న చేప‌ట్టారు.  రాత్రి 7 నుంచి 7.30 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా లైట్లు ఆర్పివేసి నిరసన తెలుపుతున్నారు. ఏపీకి పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీలను, చేసిన చట్టాలను అమలు చేయాలని 4 ఏళ్లుగా కోరుతున్నా ఈ ప్రభుత్వాలు పట్టించుకోనందుకు నిరసనగా బ్లాక్‌ డేకు పిలుపునిచ్చారు. బిజిలీ బంద్‌లో వైయ‌స్ఆర్‌సీపీ  పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ సమన్వయకర్తలు, నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పాల్గొంటున్నారు.  
Back to Top