వైయస్సార్సీపీ కార్యాలయంలో జయంతి వేడుకలు

హైదరాబాద్ః వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మహానేత దివంగత ముఖ్యమంత్రి డా. వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆంధ్రప్రదేశ్, ఏపీకి చెందిన నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వైయస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా వైయస్సార్ 67వ జయంతిని పురస్కరించుకొని 67 కేజీల కేక్ కట్ చేశారు. ఈకార్యక్రమంలో వైయస్సార్సీపీ నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి, గట్టు శ్రీకాంత్ రెడ్డి తదితర నేతలు పాల్గొన్నారు. అదేవిధంగా నగర వ్యాప్తంగా వైయస్సార్సీపీ శ్రేణులు వైయస్సార్ జయంతి వేడుకలను నిర్వహించి, సేవా కార్యక్రమాలు చేపట్టారు.


Back to Top