యువభేరి సందర్భంగా అనంతలో బైక్ ర్యాలీ

  • రేపు అనంతలో యువభేరి
  • హాజరుకానున్న వైయస్ జగన్
  • ప్రత్యేకహోదా ఆవశ్యకతపై యువతకు దిశానిర్దేశం
అనంతపురంః వైయస్సార్సీపీ అధినేత, ప్రతిపక్ష నేత వైయస్ జగన్ రాకకోసం యువత ఆశగా ఎదురుచూస్తోంది.  అనంతలో రేపు జరగబోయే యువభేరి సందర్భంగా నగరంలో యువకులు  భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. పార్టీ నేతలు అనంత వెంకట్రామిరెడ్డి, సాంబశివారెడ్డి, విద్యార్థి విభాగం నాయకుడు సలాంబాబు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై మండిపడ్డారు. విభజన సమయంలో పార్లమెంట్ సాక్షిగా  ప్రత్యేకహోదా ఇస్తామని హామీ ఇచ్చి ప్రజల్ని దగా చేశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. హోదా సహా వెనుకబడిన జిల్లాలకు రావాల్సిన ప్రత్యేక నిధులను రాబట్టడంలో చంద్రబాబు పూర్తిగా వైఫల్యం చెందారని అన్నారు. పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిన ప్రభుత్వం కేంద్రం దగ్గర నోరు మెదిపేందుకు భయపడుతోందని ఎద్దేవా చేశారు. హోదాను సాధిండమే లక్ష్యంగా ముందుకు పోతామని అన్నారు.  

యువకులు, విద్యార్థులు జగన్ అన్న కోసం ఆశగా ఎదురుచూస్తున్నారని, హోదా కోసం సమరశంఖారావం పూరించేందుకు సిద్ధంగా ఉన్నారని నేతలు అన్నారు. విద్యార్థులు, యువకులు ర్యాలీకి భారీగా తరలివచ్చారని, ఇదే ఉత్సాహంతో రేపు యువభేరిని విజయవంతం చేస్తామని అన్నారు. ఇప్పటికే తొమ్మిది జిల్లాల్లో విజయవంతంగా యువభేరి కార్యక్రమం జరిగిందని చెప్పారు. వైయస్ జగన్ ప్రసంగం ద్వారా యువత హోదా ఆవశ్యకతను తెలుసుకొని చైతన్యవంతులవుతున్నారని చెప్పారు.  వైయస్ జగన్ సారధ్యంలో ప్రభుత్వం మెడలు వంచైనా హోదా సాధిస్తామని అన్నారు. 

తాజా ఫోటోలు

Back to Top