వైయస్‌ఆర్‌ సీపీ భారీ బైక్‌ ర్యాలీ

విశాఖపట్నం: వైయస్‌ఆర్‌కు గుర్తుగా.. జగనన్నకు తోడుగా నినాదాలతో విశాఖపట్నం జిల్లా అరకు నియోజకవర్గం దద్దరిల్లింది. అరకు నియోజకవర్గ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సమన్వయకర్త శెట్టి పాల్గుణ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. వైయస్‌ఆర్‌ కుటుంబం ప్రచారంలో భాగంగా వెయ్యి మందితో కనుకడ జంక్షన్‌ నుంచి కేపీఆర్‌ స్కూల్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా శెట్టి పాల్గుణ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌ ప్రకటించిన నవరత్నాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 

తాజా ఫోటోలు

Back to Top