బీసీలకు మేలు చేసేది వైయస్సార్‌ సీపీయే

అమలాపురం రూరల్: బీసీలకు మేలు చేసేది ఒక్క వైయస్సార్‌ సీపీయేనని రాష్ట్ర పార్టీ బీసీ విభాగం అధ్యక్షుడిగా నియమితులైన మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తి యాదవ్ అన్నారని పార్టీ నేత మురళీకృష్ణ తెలిపారు.  గుంటూరులో బుధవారం జరిగిన జంగా ప్రమాణ స్వీకార సభకు జిల్లా నుంచి వైయస్సార్‌ సీపీకి చెందిన బీసీ నాయకులు తరలి వెళ్లారు. వైయస్సార్‌ సీపీలో బీసీల ప్రాధాన్యతపై రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణమూర్తి యాదవ్‌ ప్రమాణ స్వీకారం అనంతరం జిల్లా పార్టీ బీసీ నాయకులతో మాట్లాడినట్టు పార్టీ నేత మురళీకృష్ణ తెలిపారు. తామంగా నూతన అధ్యక్షుడు కృష్ణమూర్తి యాదవ్‌కు జిల్లా పార్టీ బీసీ విభాగం తరపున అభినందనలు తెలిపామని మురళీకృష్ణ పేర్కొన్నారు. ఆయనతో పాటు పార్టీ బీసీ నాయకులు సానబోయిన మోహనరావు, అప్పారి బీకన్న, గొవ్వాల అచ్యుత రామయ్య తదితరులు  అధ్యక్షుడిని గుంటూరులో కలిసి అభినందనలు తెలిపారు.

తాజా ఫోటోలు

Back to Top