అధికారంలోకి వచ్చిన వెంటనే న్యాయం చేస్తాం

వైయస్‌ఆర్‌ జిల్లా: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన
వెంటనే బీసీలకు పూర్తిస్థాయిలో న్యాయం చేస్తామని పార్టీ బీసీ సెల్‌ రాష్ట్ర
అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి అన్నారు. వైయస్‌ఆర్‌ కడప జిల్లాలోని
వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో జంగా కృష్ణమూర్తి ఆధ్వర్యంలో
బీసీ అధ్యయన కమిటీ రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. సమావేశానికి
ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్‌రెడ్డి, అంజద్‌బాషా, నేతలు అమర్నాథ్‌రెడ్డి, బీసీ
సంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ..
బీసీలకు మెరుగైన డిక్లరేషన్‌ కోసం ప్రజా, బీసీ సంఘాలను
సంప్రదిస్తున్నామన్నారు. బీసీ నేతల సూచనలను వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ
అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్తామన్నారు. బీసీల
అభ్యున్నతికి తెలుగుదేశం పార్టీ చేసిందేమీ లేదని, బీసీలను కేవలం ఓటు
బ్యాంక్‌గానే వాడుకున్నారన్నారు. వైయస్‌ఆర్‌ సీపీ అధికారంలోకి రాగానే అన్ని
విధాలుగా న్యాయం చేస్తామన్నారు. 
 

తాజా ఫోటోలు

Back to Top