కులాల మధ్య కుమ్ములాట పెట్టేలా చంద్రబాబు తీరు

నాయీ బ్రాహ్మణుల దీక్షకు వైయస్‌ఆర్‌ సీపీ మద్దతు
సీఎం వైఖరిపై జంగా కృష్ణమూర్తి, పార్థసారధి మండిపాటు
విజయవాడ: కులాల మధ్య కుమ్ములాటలు పెట్టేలా ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహరిస్తున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ బీసీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి, పార్టీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారధి ధ్వజమెత్తారు. బీసీల ఆత్మగౌరవం కించపరిచేలా మాట్లాడారని మండిపడ్డారు. విజయవాడ ధర్నా చౌక్‌ వద్ద నాయీ బ్రాహ్మణులు చేపట్టిన ఆందోళనకు వైయస్‌ఆర్‌ సీపీ మద్దతు తెలిపింది. ఈ మేరకు పార్టీ నేతలు జంగా కృష్ణమూర్తి, పార్థసారధి, మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాసులు దీక్షా శిబిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా జంగా కృష్ణమూర్తి, పార్థసారధి మాట్లాడుతూ.. బీసీ ఓట్లతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నేడు వారి పట్ల వివక్ష చూపుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాయీ బ్రాహ్మణుల న్యాయమైన డిమాండ్‌ పట్ల చంద్రబాబు వ్యవహరించిన తీరు దారుణమన్నారు. కనీస వేతనం ఇచ్చే బాధ్యత సీఎంకు లేదా అని ప్రశ్నించారు. నాయీ బ్రాహ్మణులను అవమానించిన చంద్రబాబు వారికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. 
Back to Top