మహిళ సాధికారితకు ‘వైయస్‌ఆర్‌ చేయూత’

టీడీపీ హయాంలో కార్పొరేషన్లు నిర్వీర్యం
బీసీలను మోసం చేయడానికే ఆదరణ పథకం

విజయవాడః మహిళలు సాధికారిత సాధించడానికి వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఓ అన్నగా, తమ్ముడిగా వైయస్‌ఆర్‌  చేయూత ప‌థ‌కాన్ని మ‌హిళ‌ల‌కు కానుకగా ప్రకటించినట్లు వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర బీసీసెల్‌ అధ్యక్షులు జంగా కృష్ణమూర్తి తెలిపారు. దివంగత వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి కన్న కలలను నిజం చేయాలనే లక్ష్యంతో  45 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు  ఆయా కార్పొరేష‌న్ల ద్వారా రూ.70వేల ఖాతాలో పడే విధంగా వైయస్‌ఆర్‌  చేయూతను  ప్రకటించడం జరిగిందన్నారు. మంగ‌ళ‌వారం విజ‌య‌వాడ‌లో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ..ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం పాలనలో పింఛన్లు కావాలన్న టీడీపీ నేతలు, కార్యకర్తల  చేతులు తడపనిదే పని జరగడంలేదని విమర్శించారు.  ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీ కార్పొరేషన్లను  పటిష్టపరిచి  అవినీతికి తావులేకుండా పారదర్శకంగా అమలు చేస్తామన్నారు.  బాబు పాలనలో మహిళలను పట్టించుకోడం లేదని,. ఎస్సీ,ఎస్టీ, బీసీ మైనారిటీ కార్పొరేషన్లను చంద్రబాబు నీరుగార్చారని మండిపడ్డారు.  టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడు రూ.14206 కోట్లు మహిళల రుణాలు ఉంటే వడ్డితో రూ.21600 కోట్లు అయ్యిందన్నారు. మహిళల మీద  రూ.7,394 కోట్ల వడ్డీ  భారం పడిందన్నారు. వైయ‌స్ఆర్‌సీపీ అధికారంలోకి వ‌చ్చాక‌ డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాలివ్వడం జరుగుతుందన్నారు. .ఎలక్షన్‌ తేదీ నుంచి ఎంతైతే రుణాలు ఉన్నాయో ఆ మొత్తం నాలుగు ద‌ఫాలుగా నేరుగా మ‌హిళ‌ల‌కు అంద‌జేస్తామ‌న్నారు.  మహిళల సాధికారితకు వైయస్‌ జగన్ ఇచ్చిన‌ హమీ పట్ల బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీల తరపున జ‌న‌నేత‌కు కృతజ్జతులు తెలిపారు.

 గతంలో టీడీపీ హయాంలో ఆదరణ పథకం పెట్టిందని, ఎన్నికల సమీపిస్తున్న మరో ఆదరణ పథకం తీసుకువచ్చిందని జంగా కృష్ణ‌మూర్తి విమ‌ర్శించారు. టీడీపీ దాదాపుగా 120 వాగ్ధానాలు చేసినప్పటికి ఒక్క వాగ్ధానం కూడా అమలు చేయలేదన్నారు. బీసీ వర్గాలను మోసం చేయడానికి ఆదరణ–2 పథకం తీసుకొచ్చారన్నారు. 750 కోట్ల నిధులు కేటాయించి 18 వర్గాల సంబంధించి 215 పనిముట్లను ఇస్తామని ఆదరణ పథకలో పేర్కొన్నారని ఆరునెలల కాలంలో ఎలా చేస్తారని ప్రశ్నించారు. గతంలో  నాసిరకం పనిముట్లు ఇచ్చారన్నారు. టీడీపీ  ఏ పని చేపట్టిన అవినీతి రాజ్యమేలుతుందన్నారు. ఎన్నికల సమయంలోనే  చంద్రబాబుకు బీసీవర్గాలు గుర్తుకువస్తాయని విమర్శించారు. ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌ ఏంచెప్పినా దానికో లెక్కుందన్నారు.ఆర్థిక పరమైన వెసులుబాటు తీసుకుని విశ్లేషించి హమీలు ఇస్తారన్నారు.

 
Back to Top