కులవృత్తులను నాశనం చేసిన ఘనత చంద్రబాబుదే


బీసీల అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలి
బీసీల నామినేటెడ్‌ పదవులు ఏమయ్యాయి
దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా మంత్రుల వ్యాఖ్యలు
విజయవాడ: చంద్రబాబు నాలుగేళ్ల కాలంలో బీసీలకు చేసిన అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ బీసీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి డిమాండ్‌ చేశారు. విజయవాడ వైయస్‌ఆర్‌ సీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మంత్రులు కాల్వ శ్రీనివాసులు, యనమల రామకృష్ణుడు గోబెల్స్‌ ప్రచారం చేస్తున్నారన్నారు. బీసీలను అన్ని విధాలుగా అభివృద్ధి చేశామన్న మంత్రుల వ్యాఖ్యలు దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు. బీసీలకు చంద్రబాబు ఏం చేశారో చెప్పాలన్నారు. కులవృత్తులను నిర్వీర్యం చేసింది చంద్రబాబేనని జంగా మండిపడ్డారు. బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ఎనలేని కృషి చేశారని గుర్తు చేశారు. పేద పిల్లల చదువు కోసం ఫీజురీయంబర్స్‌మెంట్‌ ప్రవేశపెట్టిన ఘనత వైయస్‌ఆర్‌దేనన్నారు.

బీసీలకు ఇస్తామన్న నామినేటెడ్‌ పదవులు ఏమయ్యాయి చంద్రబాబూ అని జంగా కృష్ణమూర్తి ప్రశ్నించారు. బడ్జెట్‌లో నిధులు, సబ్‌ప్లాన్‌కి చట్టబద్ధత ఏమయ్యాయని నిలదీశారు. నామినేటెడ్‌ పదవులు ఒకే సామాజిక వర్గానికి ఇస్తుంటే మంత్రులు కాల్వ, యనమల ఎందుకు నోరు మెదపడం లేదన్నారు. టీడీపీ హయాంలో బీసీలకు ఏం చేశారో చెప్పగలరా అని ప్రశ్నించారు. 
Back to Top