ప్రజా సంకల్ప యాత్ర..బీసీ భరోసా యాత్ర


పశ్చిమ గోదావరి: వైయస్‌ జగన్‌ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర..బీసీ భరోసా యాత్రగా సాగుతుందని వైయస్‌ఆర్‌సీపీ బీసీ సెల్‌ అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి పేర్కొన్నారు. వైయస్‌ జగన్‌ సీఎం కావడం తథ్యమని జోస్యం చెప్పారు. మల్లవరం గ్రామంలో ఏర్పాటు చేసిన బీసీల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. 

బీసీ వర్గాలను చంద్రబాబు నిలువునా మోసం చేశారని జంగా కృష్ణమూర్తి విమర్శింయారు, కుల వృత్తులను చంద్రబాబు నిర్వీర్యం చేశారన్నారు. వైయస్‌ జగన్‌ పాదయాత్ర బీసీ భరోసా యాత్రగా కొనసాగుతుందన్నారు. బడుగు, బలహీనవర్గాల ఆశాజ్యోతి వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. రాజు మంచి వాడైతే రాజ్యం సుభిక్షంగా ఉంటుందన్నారు. ఆ రోజు ఆదరణ పేరుతో చంద్రబాబు బీసీలను మోసం చేశారన్నారు. నాయిబ్రహ్మణులకు కత్తులు, రజకులకు ఇస్తీ్ర పెట్టెలు ఇచ్చారన్నారు. 

బీసీల స్థితిగతులు మార్చాలన్న ఆలోచన చంద్రబాబు చేయలేదన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి పాలనలో బీసీల అభ్యున్నతికి కృషి చేశారన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం ద్వారా అనేక మంది బీసీలు ఉన్నత చదువులు చదివారన్నారు. ఇవాళ మహానేత అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలను చంద్రబాబు నీరు గార్చారన్నారు. 2014 ఎన్నికల్లో అనేక తప్పుడు వాగ్దానాలు చేసి మోసం చేశారన్నారు. బీసీలను చంద్రబాబు కూరలో కరివేపాకు మాదిరిగా వాడుకున్నారన్నారు. వైయస్‌ జగన్‌ మేనిఫెస్టో ప్రజల మధ్య తయారు చేయబోతున్నారన్నారు. మీ సలహాలు, సూచనలే మన పార్టీ మేనిఫెస్టోగా ఉంటుందన్నారు. వైయస్‌ జగన్‌ గెలుపులో మనందరం భాగస్వాములవుదామని చెప్పారు. బీసీలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న నాయకుడు వైయస్‌ జగన్‌ అని పేర్కొన్నారు. ఏ రాజకీయ పార్టీ ఏర్పాటు చేయని బీసీ అధ్యాయన కమిటీని వైయస్‌ జగన్‌ ఏర్పాటు చేశారని గుర్తు చేశారు.
 
Back to Top