వైయస్ జగన్ అధ్యక్షతన వైయస్సార్సీపీ బీసీ సెల్ సమావేశం

విజయవాడః వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కి గన్నవరం ఎయిర్ పోర్టులో ఘనస్వాగతం లభించింది. పార్టీ నేతలు, కార్యకర్తలు అపూర్వ స్వాగతం పలికారు.  రాష్ట్రంలో బీసీలకు జరుగుతున్న అన్యాయం, వెనుకబాటు, వారి సంక్షేమానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు వైయస్‌ జగన్‌ అధ్యక్షతన వైయస్‌ఆర్‌ సీపీ బీసీ సెల్‌ సమావేశం సోమవారం విజయవాడలోని పార్టీ కార్యాలయంలో జరగనుంది. బీసీలకు జరుగుతున్న అన్యాయం, వెనుకబాటు, వారి సంక్షేమానికి తీసుకోవాల్సిన చర్యలపై జరగనున్న ఈ సమావేశానికి ఏపీ వైయస్ఆర్‌సీపీ బీసీ విభాగం నేతలు హాజరు కానున్నారు. దీంతోపాటు తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ నెలరోజులకు పైగా దీక్ష చేస్తున్న చేనేత కార్మికులకు భరోసా కల్పించేందుకు ఆయన మంగళవారం ధర్మవరం వెళ్లనున్నారు. అకుంఠిత దీక్ష, పట్టుదల, దృఢసంకల్పంతో రాష్ట్రంలోని బీసీలకు న్యాయం జరిగేలా చూసేందుకు వైఎస్ జగన్ పోరాటం కొనసాగించనున్నారు.

తాజా ఫోటోలు

Back to Top