'బంద్ కు సహకరించిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు'

హైదరాబాద్: వైసీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ప్రభుత్వంపై మండిపడ్డారు. బంద్ చేయొద్దని హెచ్చరించడం దారుణమన్నారు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయని ఉమ్మారెడ్డి మండిపడ్డారు. ప్రత్యేక హోదా ఐదు కోట్ల ప్రజల హక్కు అని అన్నారు. వైసీపీ బంద్ కు మద్దతిచ్చి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. బంద్ ను భగ్నం చేయాలని చూడడం ప్రభుత్వ అవివేకమని   విమర్శించారు.  స్పెషల్ స్టేటస్  కోసం యువకులు ఆత్మార్పణ చేసుకోవడం బాధాకరమని  ఉమ్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
Back to Top