పెడన మున్సిపల్ చైర్మన్ వైయస్సార్సీపీ కైవసం

కృష్ణాః పెడన మున్సిపల్ ఛైర్మన్ పదవి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కైవసం అయ్యింది. వైయస్సార్సీపీ అభ్యర్థి బండారు ఆనందప్రసాద్ ఛైర్మన్ గా ఎన్నికయ్యారు. అదేవిధంగా పెడన మండల పరిషత్ పీఠం కూడా వైయస్సార్సీపీకే దక్కింది.  వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అచ్యుతరాజు నేరుగా ఎన్నికయ్యారు. 

పెడన మున్సిపాలిటీకి గతంలో జరిగిన ఎన్నికల్లో 11 మంది కౌన్సిలర్లు వైయస్ఆర్ సీపీ, మరో 11 మంది టీడీపీ తరపున ఎన్నికయ్యారు. ఎక్స్ అఫిషియో సభ్యుడుగా స్థానిక ఎమ్మెల్యే కాగిత వెంకటరావు ఉన్నారు. దీంతో టీడీపీదే చైర్మన్ పీఠం అనుకుంటున్న తరుణంలో... కౌన్సిలర్ స్రవంతి ట్విస్ట్ ఇచ్చారు. టీడీపీ తరఫున గెలిచిన ఆమె ........ వైయస్సార్సీపీ అభ్యర్థి ఆనంద్ ప్రసాద్కు ఓటు వేశారు. దీంతో చైర్మన్ కుర్చి వైయస్సార్సీపీ ఖాతాలోకి వెళ్లింది. పెడన మున్సిపల్ చైర్మన్ ఆకస్మిక మృతితో చైర్మన్ ఎన్నిక అనివార్యమైంది. 

Back to Top