పేదలకు అండగా వైయస్సార్సీపీ

విజయవాడలో కట్ట కింద ఉన్న ఇళ్లను ప్రభుత్వం కూల్చేయడం పట్ల స్థానికులు మండిపడ్డారు. ఇళ్ల కూల్చివేతను వైయస్సార్సీపీ నేతలు అడ్డుకున్నారు. ప్రభుత్వం పేదవాళ్లను దిక్కులేని వాళ్లను చేస్తోందని వైయస్సార్సీపీ రాష్ట్ర  ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు గౌతంరెడ్డి ఫైరయ్యారు. గత 40, 50 ఏళ్లుగా అక్కడ జీవనం సాగిస్తున్న వారి ఇళ్లను  కూల్చేయడమేంటని నిలదీశారు.  అర్థాంతరంగా రోడ్డుకు అడ్డంగా ఉన్నాయని ఇళ్లు తొలగించడం దారుణమన్నారు . స్థానికులకు అన్యాయం చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. పేదలకు వైయస్సార్సీపీ అండగా ఉంటుందని గౌతంరెడ్డి స్పష్టం చేశారు.

Back to Top