గండేపల్లి బాధితులకు వైఎస్సార్సీపీ ఆర్థికసాయం

ఏలూరుః పశ్చిమగోదావరి జిల్లా, ప్రత్తిపాడు మండలం, యూజేపురంలో గండేపల్లి ప్రమాద బాధితులకు వైఎస్సార్సీపీ ఆర్థిక సాయం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.50వేలు, గాయపడిన వారికి రూ.5 వేల చొప్పున వైఎస్సార్సీపీ నేత జ్యోతుల నెహ్రూ వారికి చెక్కులు పంపిణీ చేశారు. నెహ్రూతో పాటు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు కూడా చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

ఇటీవలే బుూడిదలారీ బోల్తాకొట్టిన దుర్ఘటనలో  19 మంది వలస కూలీలు మృతిచెందగా..పలువురు తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసింది. ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాదం జరిగిన వెంటనే ఘటనాస్థలికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. రాజమండ్రిలో ఆస్పత్రికి వెళ్లి  బాధితులను పరామర్శించారు. చిన్నాభిన్నం అయిన ఆకుటుంబాలను చూసి చలించిపోయిన జననేత బాధిత కుటుంబాలకు ఆర్థికసాయం ప్రకటించారు. 

తాజా ఫోటోలు

Back to Top