ప్ర‌జా సంక్షేమ‌మే వైయ‌స్ఆర్‌సీపీ ధ్యేయం

కొల్లూరు (మంగ‌ళ‌గిరి): చ‌ంద్ర‌బాబు నాయుడు ఎన్నిక‌ల ముందు ఎన్నో వాగ్దానాలు చేసి ఏ ఒక్క‌టీ నెర‌వేర్చ‌లేద‌ని, అలాంటి స‌ర్కార్‌ను గ‌ద్దె దించాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ  వేమూరు నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త మేరుగ నాగార్జున అన్నారు. బుధవారం కొల్లూరులో వైయ‌స్ఆర్ కుటుంబ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించిన అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధ్యేయం ప్ర‌జా సంక్షేమ‌మే అని అన్నారు. అయితే ఇప్పుడు  టీడీపీ నేతలు అక్రమాలతో కోట్లు దోచుకుతింటున్నారని విమర్శించారు. పేద, మద్యతరగతి ప్రజల కనీస అవసరాలను ప్రభుత్వం పట్టించుకోకుండా సంక్షేమ పథకాలను నీరుగారుస్తుందన్నారు.  వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని వైయ‌స్ఆర్‌సీపీ అధికారంలోకి వస్తే చేపట్టనున్న పథకాల గురించి ఆయన ఇంటింటికి తిరిగి వివరించారు. నవరత్నాల పథకాల వల్ల ప్రజలకు చేకూరనున్న లబ్ధి గురించి మహిళలకు తెలియజేశారు. ప్రజా ఆమోదంతో ఇంటింటికి రాజన్న స్టిక్కర్లు అంటించి సభ్యత్వ నమోదు చేపట్టారు. మండలంలోని పోలింగ్‌బూత్‌ కమిటీలు సైనికుల్లా ఇంటింటికి తిరిగి ప్రభుత్వ వైపల్యాలను వివరించాలని నాగార్జున సూచించారు.

తాజా ఫోటోలు

Back to Top