వైయస్‌ఆర్‌ సీపీ పోరాటం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది

ఢిల్లీ:

ప్రత్యేక హోదా సాధన కోసం అన్ని విధాలుగా పోరాటం చేస్తున్నామని, వైయస్‌ఆర్‌ సీపీ పోరాటాలు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైందని ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి అన్నారు. అన్ని పార్టీల దృష్టికి ఆంధ్రప్రదేశ్‌ సమస్యను తీసుకెళ్లడం జరిగిందన్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ముందడుగు వేసింది కాబట్టే హోదా ఉద్యమం ఇంత ఉధృతమైందన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను సాధించడం కోసం వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. హోదాపై చర్చ జరగకపోతే.. రాజీనామాలు చేసి ప్రజల్లోకి వెళ్లి హోదా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు. 

Back to Top