ప్రభుత్వ తీరుపై వైయస్సార్‌సీపీ ఆందోళన

అనకాపల్లి: ప్రభుత్వ తీరును నిరసిస్తూ వైయస్సార్‌సీపీ ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన కార్యక్రమం చేపడుతున్నట్టు పార్టీ పట్టణ అధ్యక్షుడు
మందపాటి జానకీరామరాజు, అనకాపల్లి, కశింకోట మండల పార్టీ అధ్యక్షుడు గొర్లి సూరిబాబు, గొల్లవిల్లి శ్రీనివాసరావు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ క్యాబినెట్‌లోకి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను తీసుకున్నందుకు నిరసనగా ఈ ఆందోళన కార్యక్రమం చేపడుతున్నామన్నారు. అనకాపల్లి పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభమయ్యే ఈర్యాలీ భీమునిగుమ్మం, రింగ్‌రోడ్డు జంక్షన్‌ మీదుగా నాలుగురోడ్ల జంక్షన్‌కు చేరుకొని మానవహారం నిర్వహిస్తామన్నారు. నియోజకవర్గంలో పార్టీ నాయకులు హాజరుకావాలని వారు కోరారు.
Back to Top