అంగన్ వాడీ సమస్యలపై వైఎస్ఆర్ సీపీ వాయిదా తీర్మానం

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ లో శాసనసభలో అంగన్ వాడీ సమస్యలు, జీతభత్యాలపై మంగళవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది. కాగా రాష్ట్ర వ్యాప్తంగా అంగన్ వాడీ కార్యకర్తలు ఆందోళన చేపట్టడంతో ఈ అంశంపై అసెంబ్లీలో వాడివేడి చర్చ జరగనుంది.
వార్షిక బడ్జెట్లో అంగన్వాడీ కార్యకర్తలు, వర్కర్ల గురించి పేర్కొకపోవడాన్ని గర్హిస్తూ, వేతనాలు పెంచాలనే డిమాండ్తో ఏపీ అంగ్వాడీ కార్యకర్తలు చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని తలపెట్టారు. వేలాది మంది కార్యకర్తలు ఏపీ అసెంబ్లీ దగ్గర దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. దీనికి ప్రభుత్వం అనుమతి నిరాకరించడంతో పోలీసులు ఎక్కడికక్కడ కార్యకర్తల్ని అరెస్టు చేశారు. అసెంబ్లీ చుట్టు పక్కల ప్రాంతాలన్నీ అంగన్వాడీ కార్యకర్తల ఆందోళనలతో అట్టుడికిపోయాయి.
Back to Top