అగ్రి గోల్డ్ కుంభ‌కోణంపై వైఎస్సార్సీపీ వాయిదా తీర్మానం

హైద‌రాబాద్‌) శాస‌న‌స‌భ‌లో సోమ‌వారం నాడు బ‌డ్జెట్ ప‌ద్దుల‌పై చర్చ జ‌రిగేందుకు రంగం సిద్ధ‌మైంది. అదే స‌మ‌యంలో ప్ర‌జ‌ల‌కు ప్రాధాన్య పూర్వ‌క‌మైన అంశమైన అగ్రి గోల్డ్ కుంభ‌కోణం మీద వైఎస్సార్సీపీ శాస‌న‌స‌భ ప‌క్షం వాయిదా తీర్మానం కోరుతూ నోటీసు ఇచ్చింది. ఇది కోట్ల రూపాయిల కుంభ‌కోణం మాత్ర‌మే కాద‌ని, ల‌క్ష‌ల మంది బాధితుల‌కు సంబంధించిన అంశం అని బాపట్ల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కోన ర‌ఘుప‌తి అబిప్రాయ ప‌డ్డారు. ప్ర‌జ‌ల త‌ర‌పున ఈ వాయిదా తీర్మానం కోరుతున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. దీనికి పూర్తి బాధ్య‌త ప్ర‌భుత్వానిదే అని ఆయ‌న వ్యాఖ్యానించారు. 

తాజా ఫోటోలు

Back to Top