నేడు వైయస్సార్‌సీపీ కార్యకర్తల సమావేశం

చిట్టమూరు మండల వైయస్సార్‌కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తల సమావేశం బుధవారం జరుగుతుందని ఆ పార్టీ మండల అధ్యక్షుడు సన్నారెడ్డి శ్రీనివాసులు రెడ్డి మంగళవారం తెలిపారు. సాయంత్రం నాలుగు గంటలకు మల్లాం గ్రామ సమీపంలోని బాలచంద్రారెడ్డి గెస్ట్‌హౌస్‌లో సమావేశం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి గూడూరు నియోజకవర్గ వైయస్సార్‌సీపీ సమన్వయకర్త మేరిగ మురళీధర్‌ హాజరవుతారని పేర్కొన్నారు. మండలంలోని 23 పంచాయతీల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు తప్పక హాజరు కావాలని కోరారు.

Back to Top