వైయ‌స్‌ జగన్‌ పిలుపుతో కేరళకు వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలు


చిత్తూరు : భారీ వర్షాలతో విపత్కర పరిస్థితుల్ని ఎదుర్కొంటున్న కేరళకు సహాయం చేయడానికి వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు ముందుకొచ్చారు. పార్టీ అధ్యక్షులు వైయ‌స్  జగన్‌మోహన్‌ రెడ్డి పిలుపు మేరకు ప‌లువురు సానుకూలంగా స్పందించారు. కేరళకు అండగా నిలవడానికి తమ వంతుగా విరాళాలు అందించారు. నగరి ఎమ్మెల్యే రోజా నేతృత్వంలో చిత్తూరులో ఒక్క రోజులోనే 10 లక్షల రూపాయలు, 14 టన్నుల బియ్యం, పప్పు ధాన్యాలు, చీరలు సేకరించారు. పుత్తూరు నుంచి 30 మందితో కూడిన పార్టీ బృందం..  సేకరించిన సరుకులు, నగదును తీసుకుని కేరళకు పయనమైందని రోజా తెలిపారు. కాగా, తన వంతు సహాయంగా నెల రోజుల వేతనాన్ని ప్రకటించి ఎమ్మెల్యే రోజా బాధితులకు బాసటగా నిలిచారు.


Back to Top