వైయ‌స్ఆర్‌సీపీ నేత ర‌క్త‌దానం

ప్ర‌కాశం జిల్లా:  ప్రాణ‌పాయ‌స్థితిలో ఉన్న గ‌ర్భిణీకి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ర‌క్త దానం చేసి మాన‌వ‌త్వాన్ని చాటుకున్న ఘ‌ట‌న జిల్లాలోని గిద్ద‌లూరులో చోటుచేసుకుంది.  ద్దలూరు పట్టణం లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో సూరె సుజాత అనే గర్భిణీకి అత్య‌వ‌స‌రంగా ర‌క్తం అవ‌స‌రం కావ‌డంతో వైయ‌స్ఆర్‌సీపీ నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్ ఐవీ రెడ్డి యువ‌సేన‌ అద్యక్షులు వై.బాలు ర‌క్త‌దానం చేశారు. ఈయ‌న ఇప్ప‌టివ‌ర‌కు 17వ సారి రక్త దానం చేసి ఎందరో ప్రాణాలను నిలబేట్టారు. ర‌క్త‌దానం చేసిన బాలును ఐవీ రెడ్డి, మ‌హిళా కుటుంబ స‌భ్యులు అభినంద‌న‌లు తెలిపారు.

Back to Top