పండ‌గొచ్చింది



- తెలుగు రాష్ట్రాల్లో  వైయ‌స్ఆర్‌సీపీ 8వ ఆవిర్భావ దినోత్సవ వేడుక‌లు
- ప్ర‌కాశం జిల్లాలో పార్టీ జెండా ఆవిష్క‌రించిన అధినేత వైయ‌స్ జ‌గ‌న్‌
- రాష్ట్ర‌వ్యాప్తంగా సేవా కార్య‌క్ర‌మాలు
ప్ర‌కాశం: స్వార్థ రాజకీయ శక్తుల కుట్రలు, కుతంత్రాలను ఛేదించుకుంటూ.. ప్రజా సంక్షేమమే ఊపిరిగా అవిశ్రాంత పోరాటాలు కొనసాగిస్తూ అప్రతిహతంగా ముందుకు సాగుతున్న వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సప్త వర్షాలు పూర్తి చేసుకుని ఇవాళ‌ ఎనిమిదో ఏడాదిలోకి అడుగిడింది. ఈ సంద‌ర్భంగా తెలుగు రాష్ట్రాల్లో పార్టీ శ్రేణులు, ప్ర‌జ‌లు సంబ‌రాలు చేసుకుంటున్నారు. పార్టీ  ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్ర‌కాశం జిల్లాలో ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో ఉన్న వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఈపురుపాలెంలో జెండా ఆవిష్కరించారు. ఈ సంద‌ర్భంగా భారీ కేక్‌ను క‌ట్ చేసి పార్టీ శ్రేణుల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. జ‌న‌నేత‌కు ప‌లువురు పార్టీ నాయ‌కులు కేక్ తినిపించి శుభాకాంక్ష‌లు తెలిపారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులు సోమవారం పలు సేవా కార్యక్రమాలను చేపట్టబోతున్నాయి. పార్టీ కేంద్ర, రాష్ట్ర కార్యాలయాలు, అన్ని పార్లమెంట్‌ జిల్లా కేంద్రాల్లో, అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాలు, మండల కేంద్రాల్లో పార్టీ జెండాను ఆవిష్కరించి, సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు.

అన‌తికాలంలోనే బ‌లీయ‌మైన శ‌క్తిగా..
 ప్రజల ఆకాంక్షల మేరకు ఒక చారిత్రక అవసరంగా 2010 మార్చి 12న ఆవిర్భవించిన వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ  అనతి కాలంలోనే బలీయమైన శక్తిగా ఎదిగింది. మహానేత వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి మరణం తరువాత సంక్షోభాలు రాష్ట్రాన్ని కుదిపివేస్తున్న తరుణంలో పుట్టిన పార్టీని మొగ్గలోనే తుంచేయాలని వ్యతిరేక శక్తులు చేసిన కుట్రలేవీ ఫలించలేదు. పార్టీని స్థాపించేటప్పుడు వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఆయన మాతృమూర్తి వైయ‌స్‌ విజయమ్మ ఒక్కరే తోడుగా నిలిచారు.  ప్రజల పక్షాన నిరంతరం పోరాడుతున్న యోధుడు వైయ‌స్ జగన్‌ ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీయాలన్న కొందరి ప్రయత్నాలు ఫలించలేదు. వైయ‌స్ జగన్‌కు రోజురోజుకూ పెరుగుతున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక వైయ‌స్ఆర్‌సీపీని  లేకుండా చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పన్నిన కుట్రలు సాగలేదు. పార్టీకి పెను సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ మొక్కవోని ధైర్యంతో వైయ‌స్ జగన్‌ మరింత రాటుతేలారు. పార్టీకి దిశానిర్దేశం చేస్తూ ముందుకు న‌డుపుతున్నారు. ప్ర‌జ‌ల ఆకాంక్ష మేర‌కు ప్ర‌త్యేక హోదా కోసం నాలుగేళ్లుగా ప్ర‌త్యేక హోదా కోసం వైయ‌స్ జ‌గ‌న్ పోరాటం చేస్తూ రాష్ట్రానికి ఏకైక దిక్కుగా నిలిచారు. ఇందుకోసం ఎంపీ ప‌ద‌వుల‌కు సైతం రాజీనామా చేసేందుకు వైయ‌స్ జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకోవ‌డం దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు తెలుసుకునేందుకు గ‌తేడాది నవంబ‌ర్ 6న ప్రారంభించిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర దిగ్విజ‌యంగా సాగుతోంది. ఇప్ప‌టికే వైయ‌స్ఆర్ జిల్లా, క‌ర్నూలు, అనంత‌పురం, చిత్తూరు, నెల్లూరు, ప్ర‌కాశం జిల్లాల్లో వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర పూర్తి అయ్యింది. ఇవాళ గుంటూరు జిల్లాలోకి ప్ర‌జా సంక‌ల్ప యాత్ర అడుగుపెడుతోంది. ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో ఉన్న వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌జ‌ల మ‌ధ్య ఆవిర్భావ వేడుక‌లు నిర్వ‌హించ‌డంతో పార్టీ శ్రేణుల ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి. 
Back to Top