తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా పార్టీ ఆవిర్భావ వేడుకలు

హైదరాబాద్‌: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఏడవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆదివారం తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు గ్రామస్థాయి నుంచి ఆవిర్భావ వేడుకలను జరుపుకుంటున్నారు. మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు నివాళులర్పించి, పార్టీ జెండాను ఆవిష్కరించి సంబరాలు జరుపుకుంటున్నారు. వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వం వర్థిల్లాలని నినదిస్తున్నారు.

Back to Top