హైదరాబాద్) వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలంతా హైదరాబాద్ లోటస్ పాండ్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశం అవుతోంది. పార్టీ అధ్యక్షులు వైెఎస్ జగన్ అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది. అసెంబ్లీ సమావేశాలు జరిగిన తీరు, ముఖ్యంగా విపక్షాల గొంతు నొక్కిన వ్యవహారంపై చర్చ జరగనుంది. కాల్ మనీ సెక్సు రాకెట్, బాక్సైట్ తవ్వకాలు, కల్తీ మద్యం మాఫియా వంటి ఎన్నో ప్రజా సమస్యల్ని లోతుగా చర్చించాలని ప్రతిపక్ష వైఎస్సార్సీపీ పదే పదే డిమాండ్ చేసింది. అయినప్పటికీ ప్రజా సమస్యలు చర్చకు రాకుండా అధికార పక్షం మోకాలడ్డింది.దీంతోపాటుగా నియమాలకు విరుద్ధంగా వైఎస్సార్సీపీ మహిళా ఎమ్మెల్యే రోజాను ఏడాదిపాటు సస్పెండ్ చేయటంపై కూడా చర్చించనున్నారు. ఇందుకు సంబంధించిన కార్యాచరణ ను ఖరారు చేయనున్నారు.