'రోజా'కు సన్మానం


చిత్తూరు: రోజాను వైఎస్సార్‌సీపీ రాష్ట్ర బాధ్యులు గజమాలతో సన్మానించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెజే. కుమార్, రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డీ. లక్ష్మీపతిరాజు, మైనారిటీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహేంద్రన్‌రెడ్డి, యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి శ్యామ్‌లాల్,  ఎస్సీ సెల్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కృష్ణయ్య, నగరి మున్సిపల్ చెర్మైన్ కేజే శాంతి, వడమాలపేట ఎంపీపీ మురళీధర్‌రెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు సురేష్‌రాజు, పార్టీ నగరి పట్టణాధ్యక్షుడు అయ్యప్పన్ పాల్గొన్నారు.

సమావేశంలో రోజా మాట్లాడుతూ ఎన్నికల ముందు మోసపూరిత వాగ్దానాలు చేసి గద్దెనెక్కిన చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలను నిలువునా ముంచేశారని చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ధ్వజమెత్తారు. నగిరిలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర బాధ్యుల అభినందన కార్యక్రమానికి ఆమె అధ్యక్షత వహించి మాట్లాడారు. ఈసారి ఓడిపోతే పార్టీలో ఒక్కరు కూడా మిగలరనే భయంతో చంద్రబాబు నోటికొచ్చిన వాగ్దానాలు చేసి ప్రజలను మోసం చేశారని విమర్శించారు. పెన్షన్లు, రుణమాఫీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ రుణాల మంజూరులో పార్టీ వారికే ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. సంతకం కూడా చేయలేని వారితో కమిటీలు వేసి ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు.
Back to Top