నిరాడంబరంగా వైయ‌స్ జగన్‌ జన్మదిన వేడుకలుఅనంతపురం :  వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు  వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పుట్టినరోజు వేడుక‌లు అనంత‌పురం జిల్లాలో నిరాడంబరంగా నిర్వ‌హించారు. ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా పుట్ట‌ప‌ర్తి నియోజ‌క‌వ‌ర్గంలోని న‌ల్ల‌మ‌డ‌లో బ‌స చేయ‌గా గురువారం ఉద‌యం పార్టీ నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.  పుష్పగుచ్చాలు ఇచ్చి అభినందనలు తెలిపారు. భారీ కేక్ కట్ తెప్పించి వైయ‌స్‌ జగన్‌ చేత కట్ చేయించారు. ప్రజాసేవే పరమావధిగా పనిచేయాలని ఈ సందర్భంగా పార్టీ నేతలకు.... ఆయన  సూచించారు.  ప్రజాసంకల్పయాత్రలో ఉన్న వైఎస్‌ జగన్‌ ఈ సారి ప్రజలతో కలిసి, ప్రజల మధ్య నిరాడంబరంగా పుట్టినరోజు జరుపుకోవడం విశేషం. వేడుకల అనంతరం నల్లమడ క్రాస్‌ నుంచి 41వ రోజు ప్రజాసంకల్పయాత్రను ప్రారంభించారు.  రాగనిపల్లి, గోపేపల్లి, రామాపురం మీదుగా.... బొగ్గల పల్లి వరకు ప్రజాసంకల్పయాత్ర కొనసాగుతుంది. దారి పొడవునా ప్రజలందర్నీ పలకరించుకుంటూ, సమస్యలను తెలుసుకుంటూ వైఎస్ జగన్ ముందుకెళ్తున్నారు. మరోవైపు వైఎస్‌ జగన్‌ బర్త్‌డే సందర్భంగా పార్టీ కార్యకర్తలు... తెలుగు రాష్ట్రాలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. జ‌న‌నేత పుట్టిన రోజు సంద‌ర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో పార్టీ శ్రేణులు వివిధ సేవా కార్య‌క్ర‌మాలు త‌ల‌పెట్టారు.
Back to Top