జిల్లా అభివృద్ధికి వైయ‌స్ఆర్ కృషి

దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్‌ రాజశేఖర్‌రెడ్డి హ‌యాంలో జిల్లాను అభివృద్ధి చేసేందుకు కృషి చేశార‌ని ఎంపీ వైయ‌స్ అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు. పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటరీని 11 వేల క్యూసెక్కుల నుంచి 44 వేల క్యూసెక్కులకు పెంచారని, కొస్తాంధ్ర, తెలంగాణ ప్రతినిధులు అంగీకరించకపోయినా ధైర్యంతో ముందుకు సాగి పూర్తి చేశారని చెప్పారు.  ప్రస్తుతం బ్రహ్మంసాగర్‌కు నీరు చేరేందుకు కాలువలు సరిగా లేవని, విషయాన్ని పలు పర్యాయాలు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినా ప్రయోజనం లేకపోయిందన్నారు. వైయ‌స్‌ జగన్‌ సీఎం కాగానే వెలుగోడు నుంచి బ్రహ్మంసాగర్‌ వరకు కాలువను పూర్తి చేసి ప్రాజెక్టులో 12 టీఎంసీల నీరు నిలిపుతామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఆయా మండలాల కన్వీనర్లు నల్లేరు విశ్వనాథరెడ్డి, సుదర్శనం, సి బాష, యోగానందరెడ్డి, బోడపాడు రామసుబ్బారెడ్డి, సరస్వతమ్మ, మల్లికార్జురెడ్డి, నాయకులు సింగసాని గురుమోహన్, మునెయ్య, ఎంపీపీలు చిత్తా విజయప్రతాప్‌రెడ్డి, పెద్దరామయ్య, జడ్పీటీసీలు శారదమ్మ, సుదర్శన్, వెంకటసుబ్బయ్య ఆచారి, రామక్రిష్ణారెడ్డి, సింగిల్‌ విండో అధ్యక్షులు పోలిరెడ్డి, సుందరరామిరెడ్డి, అంకన గురివిరెడ్డి, రామిరెడ్డి, నాయకులు కరెంట్‌ రమణారెడ్డి, నాగార్జునరెడ్డి, ఈశ్వరమ్మ, దాదాన భూపాల్‌రెడ్డి, పంగా గురివిరెడ్డి, చిత్తా రవిప్రకాష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Back to Top