ప్రజా సంక్షేమమే పరమావధిగా తలచిన వైయస్ఆర్

బెళుగుప్ప: తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి తుదిశ్వాస వరకు అభివృద్దే పరమావదిగా తలచిన మహానేత దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి అని మండల వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు కొనియాడారు. శనివారం మహానేత ఎనిమిదవ వర్ధంతి సందర్బంగా స్థానిక వైయస్సార్‌ సర్కిల్‌ వద్ద వున్న వైయస్సార్‌ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వర్థంతి సందర్బంగా మండల పరిదిలోని నక్కలపల్లి, రామసాగరం గ్రామాల్లోని వైయస్సార్‌ విగ్రమాలకు స్థానిక నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈసందర్బంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో వైయస్సార్‌ తన సంక్షేమ పథకాలతో అన్ని వర్గాల అభ్యున్నతికి కృషిచేసాడన్నారు. వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి ఆశయసాధనకు వైయస్సార్‌ తనయుడు జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో కృషి జరుగుతుందని పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్‌ శ్రీనివాస్, బెళుగుప్ప సర్పంచ్‌ రామేశ్వరరెడ్డి, సింగిల్‌విండో అద్యక్షులు శివలింగప్ప, ఎర్రగుడి సర్పంచ్‌ అనిత, సింగిల్‌విండో డైరెక్టర్‌లు తిమ్మారెడ్డి, ఉప్పర నారాయణస్వామి, పార్టీ ఎస్సీ సెల్‌ మండల కన్వీనర్‌ తిప్పేస్వామి, నాయకులు ధనుంజయరెడ్డి, వెంకటేశులు, నరిగన్న, గంగవరం, వెంకటనరసు అంగడి ఎర్రిస్వామి, సంజీవరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

కుందుర్పి: మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి 8వ వర్ధంతి వేడుకలను శనివారం మండలంలోని 13గ్రామ పంచాయతీ కేంద్రాల్లో జరుపుకున్నారు. కుందుర్పిలో నాయకులు మౌన ర్యాలీ నిర్వహించి వైయస్‌ విగ్రహానికి క్షీరాభిషేకం నిర్వహించి పూజలు చేపట్టి మహానేత పాలన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల అమలుపై నెమరువేసుకున్నారు. అనంతరం అన్నదానం చేశారు. కార్యక్రమంలో కన్వీనర్‌ సత్యనారాయణశాస్త్రి, మాజీ జెడ్పీటీసీలు ఈరన్న, రాజగోపాల్, మాజీ సర్పంచులు లింగప్ప, రాధాస్వామి, తిప్పేస్వామి, బీసీసెల్‌ నాయకులు రామూర్తి, బాలరాజు, గంగాధర, సుబ్రీ, తిమ్మరాజు, ఎస్సీసెల్‌ నాయకులు ఎన్‌బాబు, మొద్దురామాంజి, మాలరమేష్, రాజేష్, మాజీ సర్పంచ్‌ హనుమప్ప, వెంకటేశులు పాల్గొన్నారు.

ఇడుపుల పాయకు తరలివెళ్లిన నాయకులు
కుందుర్పి: వైయస్‌ వర్ధంతిని పురస్కరించుకుని శనివారం మండలానికి చెందిన పలువురు వైయస్సార్‌సీపీ నాయకులు కార్యకర్తలు ఇడుపులపాయకు తరలివెళ్లారు. అక్కడ వైయస్సార్‌ ఘాట్‌ వద్ద పూజలు నిర్వహించి వర్ధంతి వేడుకల్లో పాల్గొనట్లు కలిగొలిమి, కెంచంపల్లికి చెందిన నాయకులు తిప్పేస్వామి, కుర్లపల్లి హనుమంతరాయుడు, ఎస్సీసెల్‌ నాగరాజు, నలబాలప్ప, గోవిందు తదితర 30మంది నాయకులు వెళ్లి వచ్చినట్లు తెలిపారు.

Back to Top