వైఎస్సార్ ను తలచుకొన్న అసెంబ్లీ సమావేశాలు



హైదరాబాద్) దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ అంటే ప్రజల మనస్సులో నిలిచిపోయిన మహా నేత. ఆయన చేసిన ప్రజా సేవ మరువలేనిది. తాజాగా తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఆయన పేరును నేతలు స్మరించుకొన్నారు.

తెలంగాణ అసెంబ్లీలో రైతుల ఆత్మహత్యల మీద చర్చ జరుగుతోంది. ప్రతిపక్ష ఎంఐఎం పార్టీ శాసనసభ పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ.. రైతుల అప్పుల బాధ ను ప్రస్తావించారు. రైతుల సమస్యల్ని అర్థం చేసుకొన్న ఏకైక నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని ఆయన స్పష్టం చేశారు. అందుకే అప్పుల బాధ లేకుండా చేయటానికి రైతుల అప్పుల్ని ఒక్క సారిగా మాఫీ చేసి ఆదుకొన్నారని గుర్తు చేశారు. ఈ విధంగా చేసిన నేత మరొకరు లేరని స్పష్టం చేశారు.

అదే సమయంలో గమనిస్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఎన్నికల సమయంలో రైతుల రుణాలన్నీ మాఫీ చేస్తానని దొంగ హామీలు ఇచ్చారు. తీరా అదికారంలోకి వచ్చాక ఏ మాత్రం మాఫీ చేయకుండా దొంగాట ఆడుతున్నారు. రైతుల్ని అప్పుల ఊబిలోకి నెట్టి చోద్యం చూస్తున్నారు. 

Back to Top