వైస్ ఛాన్సులర్ కు అశ్రునివాళి

నెల్లూరుః జె.ఎన్.టి.యూ వైస్ ఛాన్సులర్ సర్కార్ కు వైయస్ఆర్ విద్యార్థి విభాగం నాయకులు అశ్రునివాళి అర్పించారు. స్థానిక కె.వి.ఆర్ పెట్రోల్ బంక్ సెంటర్ లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైయస్ఆర్ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. జయవర్దన్ మాట్లాడుతూ...మేధావి, మృదుస్వభావి అయిన సర్కార్ మరణించడం దురదృష్టకరమని అన్నారు. సర్కార్ మృతి విద్యారంగానికి తీరని లోటు అని అన్నారు. ఆయన కుటుంబసభ్యులతో పాటు రోడ్డు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు భగవంతుడు ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలని కోరుకున్నారు. కార్యక్రమంలో రూరల్ అధ్యక్షుడు మధు, నగర ప్రధాన కార్యదర్శి రాకేష్, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. బుధవారం ఎన్.హెచ్ నం. 4 జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో రిజిస్ట్రార్ దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. 

Back to Top