రానున్నది వైయస్‌ఆర్‌ పరిపాలన

పాణ్యం: రానున్నది వైయస్‌ఆర్‌ పరిపాలనేని ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురి కావద్దని పాణ్యం మండల కన్వీనర్‌ పాలం చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని మద్దూరు గ్రామంలో ఎస్సీ కాలనీలో వైయస్సార్‌ కుటుంబ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పార్టీలో ప్రతి ఒక్కరిని నమోదు చేసే కార్యక్రమంలో భాగంగా పార్టీ కార్యాలయం నుండి వచ్చిన సభ్యత్వ నమోదు పత్రాన్ని ప్రతి కుటుంబం యొక్క పూర్తి వివరాలు నమోదు చేసి వారి సేల్‌ ఫోన్‌ తోనే కాల సేంటర్‌కు మిస్సడ్‌ కాల్‌ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. సభ్యత్వ నమోదుకు ప్రజలు స్వఛ్చందంగా వచ్చి నమోదు చేయించుకుంటున్నారని అన్నారు. రాజన్న మీద ఉన్న అభిమానంతో జగనన్న తలపెట్టిన ఈ కార్యక్రమంకు గ్రామీణ స్థాయిలో కార్యకర్తలు ఎంతో ఉత్సహంతో నమోదుకు వస్తున్నారని తెలిపారు. అంతేకాక ప్రభుత్వంపై ఏ స్థాయిలో వ్యతిరేకత ఉందో తెలుసుకోవచ్చు అన్నారు. ప్రభుత్వం పథకాలు గ్రామీణ ప్రాంతాల్లో ఏ ఒక్క లబ్దిదారులనికి సక్రమంగా అందడం లేదని ఆయన అన్నారు. ఇప్పటికి అనర్హులకు పించన్‌ వస్తుందని అర్హులకు పించన్‌ రావడం లేదని వారు పేర్కొన్నారు. సభ్యత్వంలో వృద్దులు తమ సమస్యలను విలపించారని అన్నారు. నమోదు చేసుకున్న ప్రతి కార్యకర్తకు పార్టీ ఎల్లవేలలా అండగా ఉంటుందని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. అనంతరం గ్రామంలో కార్యక్రమాన్ని ప్రారంభించారు. పాణ్యం , గోరుకల్లు, మద్దూరు గ్రామాల్లో ప్రారంభించారు. కార్యక్రమంలో వినోద్‌కుమార్‌రెడ్డి , మధుసూదన్‌రెడ్డి శీలన్న, సత్యరాజు, నీలమ్మ, గజ్జల శేషన్న, మాణిక్యం, ఆశీర్వాదం, నాగేంద్ర, మోశా, ఓబులేసు, తదితరులు పాల్గొన్నారు.

Back to Top