వైయస్‌ జగన్‌తోనే రాజన్న రాజ్యం సాధ్యం

తూర్పు గోదావరి: దుర్యోధన, దుశ్సాన ప్రభుత్వాన్ని ఎదురించేందుకు వైయస్‌ జగన్‌ పాదయాత్రగా మన వద్దకు వచ్చారన్నారని వైయస్ ఆర్ కాంగ్రెస్ నాయకురాలు జక్కంపూడి విజయలక్ష్మి అన్నారు. పిఠాపురం బహిరంగ సభలో ఆమె మాట్లాడారు.  ప్రజల కష్ట సుఖాలలో మమేకమైన శ్రీకృష్ణ దేవరాయులు పాలనను మనకు అందించిన దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి ప్రతి ఒక్కరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. మహానేత సువర్ణయుగం తీసుకురావడానికి సత్తా ఉన్న ఏకైక నాయకుడు వైయస్‌ జగన్‌ అన్నారు. మన కోసం గురి పెట్టిన గన్‌ లాగా ప్రజల మధ్యకు వస్తున్న వైయస్‌ జగన్‌కు అండగా ఉందామన్నారు. ప్రజలందరి ముఖాల్లో వైయస్‌ జగన్‌ చిరునవ్వులు తెస్తారని చెప్పారు.
Back to Top