పేదోళ్ల‌ దేవుడు వైయ‌స్ఆర్‌

వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా అధ్య‌క్షుడు ఆకేపాటి
రాజంపేట: దివంగత ముఖ్యమంత్రి వైయ‌స్‌ రాజశేఖర్‌రెడ్డి పేదోళ్ల‌ దేవుడని వైయ‌స్ఆర్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి అన్నారు. రాజంపేట పట్టణంలో శనివారం వైయ‌స్‌.రాజశేఖర్‌రెడ్డి ఎనిమిదవ వర్దంతి వేడుకలను ఆకేపాటి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఆర్టీసీ బస్టాండు, పాతబస్టాండు సర్కిల్‌లోని మ‌హానేత విగ్ర‌హాల‌కు ఆకేపాటి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయ‌న మాట్లాడుతూ.. దివంగత ముఖ్యమంత్రి ప్రవేశ పెట్టిన అనేక పథకాల వల్ల పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల జీవన ప్రమాణాలు ఎంతగానో మెరుగు పడ్డాయన్నారు. వైయ‌స్ఆర్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పేదల అభ్యున్నతి కోసం అహర్నిశ‌లు తపన పడిన ఏకైక నాయకుడు వైయ‌స్ఆర్ అని కొనియాడారు. వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం తథ్య‌మ‌ని, రాజన్న రాజ్యం తప్పక వస్తుందని ఆకేపాటి ఆశాభావం వ్య‌క్తం చేశారు. బాబు దుర్మార్గపు పాలనను తరిమి కొట్టి, ప్రజారంజక పాలనను తెచ్చుకునేందుకు అన్ని వర్గాల ప్రజలు వైయ‌స్ జ‌గ‌న్‌కు తోడుగా నిల‌వాల‌ని పిలుపునిచ్చారు.  కార్య‌క్ర‌మంలో  పార్టీ మున్సిపాలిటీ కన్వీనర్‌ పోలా శ్రీనివాస్‌రెడ్డి, ఊటుకూరు–2 ఎంపీటీసీ రేవరాజు శ్రీనివాసరాజు, వివిధ విభాగాల కన్వీనర్లు పసుపులేటి సుధాకర్, డీలర్‌ సుబ్బరామిరెడ్డి, జెనుగు క్రిష్ణారావుయాదవ్, పోలి మురళీరెడ్డి, ఎన్‌.ఈశ్వరయ్య, గోవిందు బాలక్రిష్ణ, పుత్తన శేఖర్‌రెడ్డి, మార్కెట్‌ క్రిష్ణారెడ్డి, దండు గోపి, పిల్లి రామ్‌ప్రణయ్, కెఎంఎల్‌.నరసింహులు, మసూద్, బలిజపల్లె చిన్న తదితరులు పాల్గొన్నారు. 
---------------------
ఊరూరా వైయ‌స్ఆర్ వర్ధంతి కార్య‌క్ర‌మాలు
వైయ‌స్ఆర్ జిల్లా(సుండుపల్లి):  దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి 8వ వ‌ర్ధంతి కార్య‌క్ర‌మాలు ఊరూరా నిర్వ‌హించారు. సుండుప‌ల్లి ప‌ట్ట‌ణంలో వైయ‌స్ఆర్‌సీపీ మండల కన్వీనర్‌ ఆనందరెడ్డి, కార్యకర్తలు కలిసి వైయ‌స్‌ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు. వైయ‌స్ ఆర్‌ అమర్‌రహే అంటూ నినాదాలు చేశారు. మండల కన్వీనర్‌ ఆనందరెడ్డి మాట్లాడుతూ వైయ‌స్‌ రాజశేఖర్‌రెడ్డి విద్యార్థుల కోసం ఫీజురీయింబ‌ర్స్‌మెంట్‌, రైతులకు ఉచిత కరెంటు తదితర ప‌థ‌కాలు ప్ర‌వేశ‌పెట్టార‌న్నారు. అడిగినవారందరికీ ఇళ్లు కల్పించిన మహనీయుడు దివంగత వైయ‌స్‌ రాజశేఖర్‌రెడ్డి అని కొనియాడారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ సిరాజుద్దీన్, గౌరవ సలహాదారుడు క్రిష్ణంరాజు, మండల కోఆప్షన్‌ మెంబర్‌ పండూస్, సిరాజుద్దీన్, బీసీనాయకులు సూరి పాల్గొన్నారు.
ఆరెమ్మ ఆలయంలో పూజలు 
మ‌హానేత  వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి వర్ధింతి సంద‌ర్భంగా స్థానిక ఆరెమ్మ ఆలయంలో  వైయ‌స్ఆర్‌సీపీ జిల్లాసంయుక్త కార్యదర్శి ఆరంరెడ్డి ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు.  అనంత‌రం మ‌హానేత చిత్ర‌ప‌టానికి నివాళుల‌ర్పించారు. పార్టీ బీసీ సెల్‌ కన్వీనర్‌ పసుపులేటి సుధాకర్‌ తన సొంత డబ్బులతో భారీగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. 
--------------------
వాడవాడలా వైయ‌స్ఆర్ వర్థంతి 
రాజంపేట: దివంగత ముఖ్యమంత్రి వైయ‌స్‌.రాజశేఖర్‌రెడ్డి ఎనిమిదవ వర్దంతిని రాజంపేట పట్టణంతో పాటు పలు గ్రామాల్లో వైయ‌స్ఆర్‌ సీపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా శనివారం స్థానిక వైయ‌స్ఆర్‌ సర్కిల్‌ (పాతబస్టాండు) వద్ద వైయ‌స్ఆర్‌సీపీ బీసీసెల్‌ కన్వీనర్‌ పసుపులేటి సుధాకర్‌ ఆధ్వర్యంలో దాదాపు మూడు వేల మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అన్నదాన కార్యక్రమాన్ని పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, వైయ‌స్ఆర్‌ సీపీ మున్సిపాలిటీ కన్వీనర్‌ పోలా శ్రీనివాస్‌రెడ్డిలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆకేపాటి, పోలాలు మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైయ‌స్‌.రాజశేఖర్‌రెడ్డి చూపిన బాటలోనే వైయ‌స్ఆర్‌ సీపీ వివిధ విభాగాల కన్వీనర్లు, కార్యకర్తలు సేవా కార్యక్రమాలు చేపట్టడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. పసుపులేటి సుధాకర్‌ మహానేత జయంతి, వర్దంతి కార్యక్రమాల సందర్భంగా వివిధ సేవా కార్యక్రమాలు చేపడుతూ ఆయ‌న‌పై తనకున్న అభిమానాన్ని చాటుకుంటున్నారని అభినందించారు. 

రోగులకు పండ్లు పంపిణీ
మహానేత వైయ‌స్‌.రాజశేఖర్‌రెడ్డి వర్దంతిని పురస్కరించుకొని శనివారం వైయ‌స్ఆర్‌సీపీ బీసీ సెల్‌ కన్వీనర్‌ పసుపులేటి సుధాకర్‌,  జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, మున్సిపాలిటీ కన్వీనర్‌ పోలా శ్రీనివాస్‌రెడ్డిల చేతుల మీదుగా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈసందర్భంగా పసుపులేటి సుధాకర్‌ మాట్లాడుతూ మహానేత వైయ‌స్‌.రాజశేఖర్‌రెడ్డి స్పూర్తితోనే తాను సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు.కార్యక్రమాల్లో ఊటుకూరు–2 ఎంపీటీసీ రేవరాజు శ్రీనివాస్‌రాజు, వైఎస్సార్‌ సీపీ వివిధ విభాగాల కన్వీనర్లు డీలర్‌ సుబ్బరామిరెడ్డి, జెనుగు క్రిష్ణారావుయాదవ్, ఎన్‌.ఈశ్వరయ్య, మర్రి రవి, పోలి మురళీరెడ్డి, గోవిందు బాలక్రిష్ణ, పుత్తన శేఖర్‌రెడ్డి, దండు గోపి, కెఎంఎల్‌.నరసింహులు, మార్కెట్‌ క్రిష్ణారెడ్డి, నారపురెడ్డిపల్లె రవికుమార్‌యాదవ్, ఎస్‌.జాహీద్‌అలీ, మసూద్, పిల్లి రామ్‌ప్రణయ్, బలిజపల్లె చిన్న తదితరులు పాల్గొన్నారు. 
 ---------------------------
వైయ‌స్‌ రాజశేఖర్‌రెడ్డి చిర‌స్మ‌ర‌ణీయుడు
నందలూరు: దివంగత మహానేత వైయ‌స్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రజల గుండెల్లో చెరగని ముద్రవేశారని, ప్రజలు ఇప్పటికీ ఆయ‌న‌ను మ‌ర‌వ‌లేర‌ని వైయ‌స్ఆర్‌సీపీ మండల అధ్యక్షుడు సిద్దవరం గోపిరెడ్డి పేర్కొన్నారు. శనివారం వైయ‌స్‌ రాజశేఖర్‌రెడ్డి 8వ వర్ధంతి సందర్భంగా స్థానిక బస్టాండు కూడలి సమీపంలో ఉన్నవైయ‌స్‌ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి ఆయ‌న‌ పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గోపిరెడ్డి మాట్లాడుతూ ప్రజలకు అనేక సంక్షేమపథకాలు ప్రవేశపెట్టి ప్రజల హృదయాల్లో ఆయన చెరగని ముద్ర వేసుకున్నారని అన్నారు. అందువల్ల ప్రజలు ఆయన మరణించి ఎనిమిది సంవత్సరాలు అయినప్పటికీ ఆయన మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. కార్యక్రమంలో  పార్టీ నాయకులు అరిగెల దినేష్, గీతాల నరసింహారెడ్డి, ఆణాల మధు, రామక్రిష్ణ తదితరులు పాల్గొన్నారు. 
------------------------- 
ఆదర్శప్రాయుడు వైయ‌స్ఆర్‌
ఖాజీపేట: నేటితరం రాజకీయ నాయకులందరికి దివంగత ముఖ్యమంత్రి వైయ‌స్‌రాజశేఖర్‌రెడ్డి ఆదర్శప్రాయుడని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శ ఇవి మహేశ్వర్‌రెడ్డి, జిల్లా అధికారప్రతినిధి దస్తగిరిబాబు, మండల కన్వీనర్‌ జనార్థన్‌రెడ్డిలు అన్నారు. వైయ‌స్ఆర్ 8వర్థంతిని పురస్కరించుకుని కొటింగురువాయపల్లె లో ఉన్న మ‌హానేత‌ విగ్రహానికి మండల నాయకులు పూలమాలలు వేసి నివాళుల‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా వారు  మాట్లాడుతూ ఉమ్మడిరాష్ట్రంలో ఉన్న ప్రతి వ్యక్తికి సంక్షేమ ఫలాలు అందించిన ఘనత వైయ‌స్ఆర్‌ కే దక్కుతుందని అన్నారు. పేద మధ్యతరగతి ప్రజలను దృష్టిలో పెట్టుకుని అనేక సంక్షేమఫలాలు అందించారని అన్నారు. అందుకే ఆయన మనమధ్యలేక పోయినా అందరి గుండెల్లో చిర‌స్థాయిగా ముద్ర వేసుకున్నార‌ని కొనియాడారు. ఏటూరు గ్రామంలో రాజగోపాల్‌రెడ్డి తోపాటు పార్టీ కార్యకర్తలు వైయ‌స్ఆర్ విగ్ర‌హానికి పూల మాలలు వేసి ఘన నివాళి అర్పించారు. బి.కొత్తపల్లెలో మాజీ సర్పంచ్‌ నాగిరెడ్డి ఆధ్వర్యంలో వైయ‌స్ఆర్‌  విగ్రహానికి  నివాళి అర్పించారు. కే. సుంకేశుల లో కొండారెడ్డి ఆధ్వర్యంలో వ‌ర్ధంతి కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు.  
--------------------------

 వైయ‌స్ఆర్‌ వర్ధంతి వేడుకలు 
చాపాడు: దివంగత ముఖ్యమంత్రి వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి ఎనిమిదవ వర్ధంతి వేడుకలను శనివారం చాపాడులో ఘనంగా నిర్వహించారు. స్థానిక నాలుగు రోడ్ల కూడలిలోని వైఎస్‌ విగ్రహానికి వైయ‌స్ఆ ర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు పూల మాలలు వేసిన నివాళులర్పించి, వైయ‌స్‌ పరిపాలన, పథకాలు, సేవలను గురించి కొనియాడారు.  కార్యక్రమంలో మండల జెడ్పీటీసీ సభ్యులు శ్రీయపురెడ్డి బాలనరసింహారెడ్డి, ఎంపీపీ వెంకటలక్షుమ్మ భర్త మండల నాయకులు లక్షుమయ్య, ఉప మండలాధ్యక్షులు సానా నరసింహారెడ్డి, చియ్యపాడు ఎంపీటీసీ–2 మహేష్‌యాదవ్, వైయ‌స్ఆర్‌ సీపీ ఎస్సీ సెల్‌ జనరల్‌ సెక్రెటరి జయరాజు, బీసీ సెల్‌ మండల కార్యదర్శి మహామ్మద్‌ దస్తగిరి, నాయకులు జయరామిరెడ్డి, కర్నాటి నారాయణరెడ్డి, జయసుబ్బారెడ్డి, రమణయ్య, రాజతిమ్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.  
చిన్నఓరంపాడులో..
 ఓబులవారిపల్లె మండ‌లం చిన్న ఓరంపాడులో  దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైయ‌స్‌ రాజశేఖర్‌రెడ్డి ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా శనివారం ఆయనకు మండలంలోని నాయకులు, ప్రజలు ఘనంగా నివాళులు అర్పించారు. చిన్నఓరంపాడు అడ్డరోడ్డు నందు సింగిల్‌విండో అధ్యక్షులు టంగుటూరు క్రిష్ణారెడ్డి, మండల యూత్‌కన్వీనర్‌ జయపాల్‌రెడ్డి, సర్పంచ్‌ శైలజా రమేష్‌కుమార్‌రెడ్డి, వైఎస్సార్‌జిల్లా ట్రేడ్‌ యూనియన్‌ సెక్రటరీ తల్లెం భరత్‌కుమార్‌రెడ్డి నాయకులతో కలిసి మహానేత వైయ‌స్ఆర్‌  విగ్రహానికి క్షీరాభిషేకం చేసి పూలదండలతో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా టంగుటూరు క్రిష్ణారెడ్డి మాట్లాడారు.   కార్యక్రమంలో సీనియర్‌ నాయకులు పాపుగారి శివారెడ్డి, మందరం బాబురెడ్డి, టంగుటూరు చిన్నారెడ్డి, వార్డుసభ్యులు అరిగెల రమణ, ఏపీఎస్‌ఎఫ్‌ అధ్యక్షులు పామూరు దీపక్‌రెడ్డి, ఎన్‌.వెంకటేష్, ఎస్సీ నాయకుడు ప్రేమ్‌ తదితరులు పాల్గొన్నారు.

 కాపుపల్లెలో:
మండలంలోని కాపుపల్లె గ్రామంలో పారిశ్రామికవేత్త, వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు పులపత్తూరు రామసుబ్బారెడ్డి ఆధ్వర్యంలో దివంగత ముఖ్యమంత్రి వైయ‌స్‌ రాజశేఖర్‌రెడ్డికి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వైయ‌స్‌ రాజశేఖర్‌రెడ్డి చిత్రపటానికి పూలమాలలువేసి గ్రామంలోని పిల్లలకు, వృద్దులకు పండ్లు పంపిణీచేశారు. ఈ సందర్భంగా రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ దివంగత మహానేత రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన‌ జీఓనెంబర్‌ 296తో మంగంపేట పరిసర ప్రాంతాలలో వందలాది ఫల్వరైజింగ్‌ మిల్లులు ఏర్పడి వేలాదిమందికి జీవనోపాధి కలిగిందని అన్నారు.  కార్యక్రమంలో సుబ్బరామిరెడ్డి, వెంకటరెడ్డి, రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.  
----------------------
వైయ‌స్‌ ఆశయ సాధనకు కృషి 
చక్రాయపేట : దివంగత ముఖ్యమంత్రి వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి ఆశయసాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాల‌ని ఎంపీపీ మోపూరి మునికుమారి పేర్కొన్నారు. శనివారం వైయ‌స్‌ఆర్ వర్థంతిని పురస్కరించుకొని ఆమె మండలంలోని కొండవాండ్లపల్లెలో ఉన్న వైయ‌స్‌ఆర్‌ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గ్రామస్తులకు స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కిరణ్‌కుమార్, మోపూరి అశోక్‌కుమార్‌రెడ్డి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. 
--------------

మహానేతకు నివాళి 
సింహాద్రిపురం : దివంగత ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజశేఖరరెడ్డి వ‌ర్ధంతిని సింహాద్రిపురంలో శనివారం ఘనంగా నిర్వహించారు. బస్టాండు, మూడు రోడ్ల కూడలి, వైయ‌స్‌ కుమ్మరాంపల్లెలోని విగ్రహాలకు సర్పంచ్‌ రామ్మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలోనూ, వైయ‌స్‌ఆర్‌ సర్కిల్‌లోని విగ్రహానికి వైయ‌స్‌ఆర్‌సీపీ రాష్ట్ర రైతు నాయకుడు అరవిందనాథరెడ్డి ఆధ్వర్యంలో పూలమాలలువేసి నివాళులర్పించారు.  వైయ‌స్ఆర్‌ స్వగ్రామమైన బలపనూరులో వైయ‌స్‌ విగ్రహానికి వెలుగోటి శేఖరరెడ్డి, యువజన నాయకులు నవీన్‌కుమార్‌రెడ్డిల ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు. పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. ఆయా కార్యక్రమాలలో వైయ‌స్‌ఆర్‌సీపీ నాయకులు మధు, శేఖరరెడ్డి, సుదర్శన్‌రెడ్డి, కృష్ణారెడ్డి, జనార్థన్‌రెడ్డి, సురేష్, నజీర్, అనిల్, సునీల్, కో.ఆప్సన్‌ సభ్యుడు ముజుబూర్‌ తదితరులు పాల్గొన్నారు. 
Back to Top