వైయస్సార్ హయాం స్వర్గంలా ఉండేది

వైయస్ రాజశేఖర్ రెడ్డి లెజెండ్
అన్ని వర్గాల ప్రజలను ఆదుకున్న మహానేత
వైయస్సార్ అడుగుజాడల్లో వైయస్ జగన్

అమెరికాః చికాగోలో ఆటా సిల్వర్ జూబ్లీ ఉత్సవాల సందర్భంగా నిర్వాహకులు మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. వైయస్సార్సీపీ నేతలు ఈకార్యక్రానికి ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు. 

ప్ర‌జలు వైయ‌స్ జ‌గ‌న్‌తోనే ఉన్నారు
వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గ‌డికోట శ్రీ‌కాంత్ రెడ్డి
ఏపీలో మీడియా ఘోరంగా తయారైందని వైయస్సార్సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశఆరు.  లేనిది ఉన్న‌ట్టు... ఉన్న‌ది లేన‌ట్టు చూపిస్తోందని  శ్రీ‌కాంత్ రెడ్డి అన్నారు. బాబు రాష్ట్రంలో అప్రజాస్వామికంగా దారుణమైన పాలన సాగిస్తున్నారన్నారు. బాబు చేస్తున్న దుష్ర్పచారాన్ని, అవాస్తవాలను తిప్పికొడుతూ అద్భుతంగా పనిచేస్తున్న సోషల్ మీడియాకి కృతజ్ఞతలు తెలిపారు. తెలుగు ప్ర‌జ‌లంద‌రు వైయ‌స్ జగన్ తోనే  ఉన్నార‌ని ఆయ‌న పేర్కొన్నారు. అందరం కష్టపడుదామని చెప్పారు.  ప్ర‌ముఖ వ్యాపార వేత్త మ్యాట్రిక్స్ ప్ర‌సాద్ ను వైయ‌స్ జ‌గ‌న్ సంస్థ‌ల్లో పెట్టుబ‌డులు పెట్టినందుకు జైలుకు పంపించార‌న్నారు. ఆయ‌న ఓ పోలీస్ ఉన్న‌తాధికారితో మాట్లాడుతూ... నేను త‌ప్పుడు సెట్‌మెంట్ ఇస్తే నాకు ఏ ర‌క‌మైన శిక్ష ప‌డ‌కుండా చేస్తాన‌న్నార‌ని, కానీ నాకు అది న‌చ్చ‌లేద‌ని, నా ద‌గ్గ‌ర ఐదు రూపాయ‌లు ఉన్నా ఆ డ‌బ్బుల‌ను వైయస్ జ‌గ‌న్ సంస్థ‌ల్లో పెట్టుబ‌డులు పెడ‌తాన‌ని చెప్పిన విష‌యం గుర్తు చేశారు. 

వైయ‌స్సార్ ఒక లెజెండ్‌
వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్‌ రెడ్డి
వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ఒక లెజెండ్ అని వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ నేత గురున్నాథ్ అన్నారు. వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ప‌థ‌కాలు తిరిగి అమ‌లులోకి రావాలంటే వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అధికారంలోకి రావాల‌న్నారు.  వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని ముఖ్య‌మంత్రిని చేసుకోవ‌డ‌మే త‌మ ల‌క్ష్య‌మ‌న్నారు. 

మహానేత గురించి ఎంతచెప్పినా తక్కువే
వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాచ‌మ‌ల్లు శివ‌ప్ర‌సాద్‌ రెడ్డి
వైయ‌స్సార్ చిత్ర‌ప‌టం పెట్టి ఆయ‌న గురించి 5 నిమిషాలు మాత్ర‌మే చెప్ప‌మంటే ఎలా సాధ్య‌మ‌ని వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాచ‌మ‌ల్లు శివ‌ప్ర‌సాద్ అన్నారు. ఆ మ‌హానుభావుడి గురించి ఐదు రాత్రులు, ఐదు ప‌గ‌లు చెప్పినా స‌మ‌యం స‌రిపోద‌న్నారు. వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఎవ‌రి మాట విన‌డు అని అంటారు అది నిజ‌మే.... రైతు రుణాలు మాఫీ చేయ‌లేమ‌ని వైయ‌స్ జ‌గ‌న్‌కు తెలుసు కానీ చేస్తాం అని చెప్పుచెప్పు అంటే ఆ మాట విన‌డు అని పేర్కొన్నారు. ఆప్ర‌జాస్వామిక‌మైన విధివిధానాల‌ను గౌర‌వించ‌ర‌ని, డ‌బ్బులు పెట్టి ఎమ్మెల్యేలను కొని స‌ర్కారును ప‌డ‌గొట్టి మ‌నం రెండేళ్లు సీఎంగా ఉందాం అంటే ఆ మాట‌ను గౌర‌వించ‌ర‌ని ఆయ‌న పేర్కొన్నారు. అది ఆ ప్ర‌జాస్వామికని వైయస్ జగన్ అంటారని చెప్పారు. సోనియా గాంధీ, చంద్ర‌బాబునాయుడులు కుట్ర‌పూరిత‌మైన రాజ‌కీయాలు చేసి జైలుకు పంపించి, నిరంకుశంగా వ్య‌వ‌హరించే వ్య‌క్తుల‌ను లెక్క‌చేయ‌డని వివ‌రించారు. 

రైతు రాజ్యాన్ని తెచ్చిన మ‌హానుభావుడు వైయ‌స్సార్‌
వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి
మీ పిల్లలను ఉన్నత చదువులు చదివించాలనుకుంటే వెనకాడవద్దని, తాను భరోసాగా ఉంటానంటూ ఫీజు రీయింబర్స్ మెంట్ పథకంతో పేద  ప్రజల కుటుంబాలకు దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి అండగా నిలిచారని వైయస్సార్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తెలిపారు. 
ఎంతో మంది పేద విద్యార్థుల‌కు ఉన్న‌త విద్య‌ను అందించిన మ‌హానుభావుడు వైయ‌స్సార్ అన్నారు. మ‌హిళలు ఆర్థికంగా నిలదిక్కుకోవాలని పావలా వ‌డ్డీకే రుణాల‌ను అందించార‌న్నారు. రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చి, రుణాల‌ను మాఫీ చేసి రైతు రాజ్యాన్ని తీసుకొచ్చిన మ‌హానేత వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి అని పేర్కొన్నారు. 

వైయ‌స్సార్ హయాం స్వ‌ర్గంలా ఉండేది
వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీ‌నివాసులు
వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డిని క‌ల‌వ‌డానికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో పాటు టీడీపీ ఎమ్మెల్యేలు కూడా ఎక్కువ‌గా క‌లవ‌డానికి ఇష్ట‌ప‌డేవారు అని వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీ‌నివాసులు అన్నారు. వైయ‌స్సార్ త‌న ప‌థ‌కాల‌తో ప్ర‌తిప‌క్ష పార్టీ ఎమ్మెల్యేల‌ను సైతం ఆక‌ర్షించేవార‌న్నారు.  ఒక రాష్ట్రం ప్ర‌వేశ‌పెట్టిన ప‌థ‌కాల‌ను ఇత‌ర రాష్ట్రాలు సైతం అనుస‌రించాయంటే ఒక్క వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ప‌థ‌కాలు మాత్ర‌మేన‌ని ఆయ‌న పేర్కొన్నారు. వైయ‌స్సార్ పెట్టిన ప‌థ‌కాలు ఏ దేశం కూడా పెట్ట‌లేద‌న్నారు. వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి హయాం స్వర్గంలా ఉండేద‌న్నారు. 

వైయ‌స్ జ‌గ‌న్ ఆంధ్రప్ర‌దేశ్‌కు కాదు... భార‌త‌దేశానికి లీడ‌ర్‌
వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ విశాఖ‌ప‌ట్నం జిల్లా అధ్య‌క్షుడు గుడివాడ అమ‌ర్నాథ్
రాష్ట్రంలో జ‌రుగుతున్న ప్ర‌జాస్వామ్య ఖూనీ మీద ఢిల్లీలో వివిధ రాజ‌కీయ పెద్ద‌ల‌ను క‌లిసిన‌ప్పుడు.... ఒక రాజ‌కీయ నాయ‌కుడు వైయస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డిని ఉద్దేశించి జ‌గ‌న్‌ మీరు కేవ‌లం ఆంధ్ర‌ప్ర‌దేశ్ లీడ‌ర్ మాత్ర‌మే కాద‌ని రాబోయే కాలంలో భార‌త‌దేశానికి లీడ‌ర్ అవుతార‌ని చెప్పార‌ని వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ విశాఖ‌ప‌ట్నం జిల్లా అధ్య‌క్షుడు గుడివాడ అమ‌ర్నాథ్ అన్నారు. 2009 ఎన్నిక‌ల అనంత‌రం వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డిని ఒక ప‌త్రికా విలేక‌రి ఈ సంవ‌త్స‌రం క‌రువు రాబోతుందని అడిగిన‌ప్పుడు... అప్పుడు వైయ‌స్సార్ 2009 ఎన్నిక‌ల్లో ఎగ్జిట్‌పోల్స్ వారు మ‌హాకూట‌మి అధికారంలోకి రాబోతుంద‌ని చెప్ప‌డంతో మేఘాలు భ‌య‌ప‌డి చైనా వెళ్లిపోయాయ‌ని, ఇప్పుడు మ‌ళ్లీ మేము అధికారంలోకి వ‌చ్చాం కాబ‌ట్టి మేఘాలు తిరిగి రావ‌డానికి స‌మ‌యం ప‌డుతుంద‌న్నార‌ని చెప్పారు. నిజంగానే మ‌రుస‌టి రోజు భారీ వ‌ర్షాలు ప‌డ్డాయ‌న్న విష‌యం అంద‌రికీ గుర్తు చేశారు. 
Back to Top