ప్రజల హృదయాల్లో నిలిచిన మహనీయుడు

కమలాపురం అర్బన్‌ః  ప్రజల హృదయాల్లో నిలిచిన మహనీయుడు దివంగత ముఖ్యమంత్రి వైయస్‌. రాజశేఖర్‌రెడ్డి అని ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. శనివారం స్థానిక అనాధ ఛాత్రాలయంలో వైయస్సార్‌సీపీ పట్టణ అధ్యక్షుడు ఎన్‌.సి.పుల్లారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైయస్సార్‌ 8వ వర్థంతి వేడుకల్లో ఆయన పాల్గోని వైయస్సార్‌ చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. వైయస్సార్‌ వర్థంతి సందర్బంగా ప్రతి ఏడాది పుల్లారెడ్డి సేవా కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. వైయస్సార్‌ ప్రజల మనిషిగా చిరస్మరనీయంగా గుండెల్లో నిలిచాడన్నారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రియింబర్స్‌మెంట్‌ , రైతు రుణమాఫి, ఉచిత విద్యుత్‌ తదితర పథకాలను పేద ప్రజలు సద్వినియోగం చేసుకోనేలా పాలన సాగించారన్నారు. వైయస్సార్‌ లాంటి స్వర్ణయుగం రావాలంటే జగన్‌ సీఎం కావాలన్నారు. టీడీపీ నాయకులు డబ్బులు నీరులా ఖర్చు పెట్టి గెలిచామని సంబరాలు చేసుకుంటున్నారని అది వారి భ్రమ మాత్రమే అన్నారు. 2019లో జరిగే సాధారణ ఎన్నికల్లో ప్రజలు జగన్‌ను సీఎం చేస్తారని ఆకాంక్షించారు. అనంతరం బాలురకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్‌ ఉత్తమారెడ్డి, రాజుపాలెం సుబ్బారెడ్డి,సీఎస్‌. నారాయణరెడ్డి, సంబటూరు ప్రసాద్‌రెడ్డి, సుమీత్రారాజశేఖర్‌రెడ్డి, మారుజొళ్ళ శ్రీనివాసరెడ్డి, సుదా కొండారెడ్డి, పి. వి. క్రిష్ణారెడ్డి, మునిరెడ్డి, ఆర్‌విఎన్‌ఆర్, అల్లె రాజారెడ్డి, లక్ష్మీనారాయణరెడ్డి,రమణారెడ్డి, జెట్టి నగేష్,

స్థల పరిశీలన చేసిన ఎమ్మెల్యే
ఈనెల 4 తేదిన జరిగే కమలాపురం నియోజక వర్గ స్థాయి నవరత్నాల ప్లీనరి సభ స్థలాన్ని శనివారం ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... సభకు హాజరయ్యేవారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండ తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గుంటూరు ప్లీనరీలో ప్రకటించిన నవరత్నాలను ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి దిశ నిర్థేశం చేయనున్నట్లు తెలిపారు, నియోజక వర్గంలోని సికేదిన్నే, చెన్నూరు, విన్‌పల్లె, పెండ్లిమర్రి, కమలాపురం మండలాలకు చెందిన బూత్, గ్రామ పంచాయతీల కమీటి కన్వీనర్లు, కార్యవర్గ సభ్యుల పాల్గోంటారన్నారు.

తూర్పుపల్లె(రైల్వేకోడూరు అర్బన్‌): మండలంలోని అనంతరాజంపేట పంచాయితీలోని తూర్పుపల్లె గ్రామంలో పంజం వేణుగోపాల్‌రెడ్డి, ఆకేపాటి రంగారెడ్డిల ఆధ్వర్యంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి 8వ వర్ధంతిని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని వైయస్సార్‌ విగ్రహానికి క్షీరాభిషేకం చేసి పూలమాలలు అలంకరించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి మరణం ప్రజలకు తీరనిలోటని తెలిపారు. ఆయన సంక్షేమపాలన నేటికీ ప్రజల్లో గుర్తిండిపోయిందని అన్నారు.

వైయస్‌ ఆశయసాధనకు కృషి చేద్దాం

బద్వేలు అర్బన్‌ : పేద ప్రజల సంక్షేమం కోసం నిరంతరం తపన పడే మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి ఆశయ సాధన కోసం కృషి చేద్దామని వైయస్‌ఆర్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్‌ జి.వెంకటసుబ్బయ్య పేర్కొన్నారు. వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి 8వ వర్థంతి సందర్భంగా శనివారం స్థానిక బైపాస్‌రోడ్డులోని, ఎన్జీవో కాలనీ వద్ద ఉన్న వైయస్‌ఆర్‌ విగ్రహాలకు పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం సుమిత్రానగర్‌లోని షాలోమ్‌ అనాథ శరణాలయంలో చిన్నారులకు పండ్లు, బ్రెడ్డు పంపిణీ చేశారు. 
వైఎస్‌ హయాంలో అనేక సంక్షేమ పధకాలు అమలుపులివెందుల

ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వైయస్సార్‌

రైల్వేకోడూరు :దివంగతనేత వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి పార్టీలకు అతీతంగా సంక్షేమ ఫలాలను ప్రజలందరికీ అందించి వారి హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుని చరిత్రలో నిలిచి పోయారని ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు అన్నారు. దివంగనేత వైయస్సార్‌ 8వ వర్ధంతి వేడుకల్లో భాగంగా రైల్వేకోడూరు పట్టణంలోని వైయస్సార్‌ సీపీ కార్యాలయంలో శనివారం శ్రీ విజలయలక్ష్మీ మినరల్‌ అండ్‌ ట్రేడింగ్‌ కంపెనీ ఆధ్వర్యంలో మేనేజర్‌ మురళీ సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. ఫాస్టర్‌ రెవరెండ్‌ ఆనంద్‌ సురేష్‌ బాబు, పుష్పరాజ్‌ మరి కొందరితో కలిసి దివంగనేత ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థనలు చేశారు. ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని అభివృద్ది పథంలో నడిపించిన ఆయన అకాల మరణం రాష్ట్రానికి తీరని లోటు అన్నారు. ఆయన మరణం తర్వాత ఎన్నో పరిణామాలు సంభవించాయన్నారు. నంద్యాల, కాకినాడ ఎన్నికల గురించి అ«దైర్యపడొద్దని, రానున్నవి మన రోజులేనన్నారు. వైయస్సార్‌ గర్తుగా జగనన్నకు మనందరం తోడుగా ఉండాలని కోరారు. వచ్చే ఎన్నికలలో సత్తా చూపి అమరావతిలో పార్టీ జెండాను ఎగురవేయాలన్నారు.

తొండూరు; దివంగత మహనేత వైయస్‌ రాజశేఖరరెడ్డి 8వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. శనివారం ఉదయం ఇనగలూరు బస్టాండు వద్ద ఉన్న వైయస్‌అర్‌ విగ్రహానికి స్థానిక వైయస్‌అర్‌ సీపీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. 

మైదుకూరు టౌన్‌ : మన నుంచి దూరమైనా ప్రతి మనిషి గుండెలో ఎల్లప్పుడూ చిరస్మరణీయుడుగా నిలచి ఉండేది ఒక దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి మాత్రమేనని వైయస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి రాచమల్లు రవిశంకర్‌రెడ్డి పేర్కొన్నారు. దివంతగత నేత ప్రియతమ నాయకుడు వైయస్‌రాజశేఖర్‌రెడ్డి 8వవర్ధంతి వేడుకలను శనివారం నియోజకవర్గంలో వైయస్‌విగ్రహాలకు నివాళులర్పించారు. Back to Top