వైయస్సార్ ఆశ‌య సాధ‌న కోసం కృషి

విజ‌య‌వాడ‌)) దివంగ‌త మ‌హానేత వైయ‌స్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ఆశ‌య సాధ‌న కోసం కృషి చేయాల‌ని వైయ‌స్సార్సీపీ మునిసిప‌ల్ కార్పొరేష‌న్ ఫ్లోర్ లీడ‌ర్ పుణ్య‌శీల పిలుపు ఇచ్చారు. విజ‌య‌వాడ లో పేదల కాల‌నీలో వైయ‌స్సార్సీపీ నాయ‌కుల ఆధ్వ‌ర్యంలో సేవ కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు. ఈ సంద‌ర్బంగా పుణ్య‌శీల ముఖ్య అతిథిగా విచ్చేశారు. పేద‌ల‌కు ఎన్నో సంక్షేమ కార్య‌క్ర‌మాలు చేప‌ట్టిన ఘ‌న‌త వైయ‌స్సార్ కు చెందుతుంద‌ని ఆమె అన్నారు. అటువంటి ప్రజా సంక్షేమ బాట‌లో వైయ‌స్సార్సీపీ కార్య‌క‌ర్త‌లు, అభిమానులు ప‌య‌నించాల‌ని పుణ్య‌శీల సూచించారు. 
Back to Top