వైయస్‌ఆర్‌ పాలన ఓ స్వర్ణయుగం


తూర్పుగోదావరి: దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి పాలన ఓ స్వర్ణయుగమని వైయస్‌ఆర్‌సీపీ నేతలు పేర్కొంటున్నారు. వైయస్‌ఆర్‌ పాలనలో ప్తరి కుటుంబం లబ్ధి పొందిందని చెప్పుకుంటున్నారు. ఈ నెల 8వ తేదీ వైయస్‌ఆర్‌ జయంతి సందర్భంగా ప్రజలు వైయస్‌ జగన్‌ పాదయాత్రలో రాజన్నను గుర్తుకు తెచ్చుకుంటున్నారు.  మహానేత తనయుడు వైయస్‌ జగన్‌ కూడా తండ్రికి తగ్గట్టుగా ప్రజలకు మేలు చేస్తారని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కావాలని ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారని పేర్కొంటున్నారు. రాజన్న బిడ్డకు ప్రజలు కష్టాలు తెలుసు అని, ఆయన 2019లో తప్పనిసరిగా సీఎం అవుతారని, ప్రజల కష్టాలు తీరుతాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సంకల్ప యాత్రలో వైయస్‌ జగన్‌ను కలుసుకోవడానికి ప్రజలు పోటెత్తుతున్నారు. ఎంతో అభిమానంగా తన పాదయాత్రకు తరలివస్తున్న జనాలను వైయస్‌ జగన్‌  ఆప్యాయంగా పలకరిస్తూ..వారి బాధలు ఓపికతో వింటున్నారు. 
 
Back to Top