సత్తెనపల్లిలో వైయస్‌ఆర్‌ స్మారక క్రీడాపోటీలు

గుంటూరు:

గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆదేశానుసారం కబడ్డీ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు వైయస్‌ఆర్‌ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు పేర్కొన్నారు.  ఈ నెల 28, 29 తేదీల్లో వైయస్‌ఆర్‌ స్మారక సత్తెనపల్లి నియోజకవర్గ పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రెండు రోజుల పాటు జరిగే ఈ క్రీడా పోటీలు నర్సరావుపేట రోడ్డులోని చెక్‌పోస్టు వద్ద గల క్రీడా ప్రాంగణంలో జరుగుతాయన్నారు. పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతుల ప్రదానం ఉంటుందన్నారు. 

Back to Top