మహానేత స్మృతిలో ఒక లేఖ

రాజన్నా ఎక్కడున్నావ్? ఎలా ఉన్నావ్…! ఎక్కడున్నా నువ్వు మమ్మల్ని ఓ కంట చూస్తూనే ఉంటావు మాకు తెలుసు. మా కష్టాలు చూసి కన్నీరు పెట్టుకునే ఉంటావు. నువు మమ్మల్ని వీడిపోయి నేటికి ఎనిమిదేళ్లు. కాలం పరిచిన ముళ్లదారిలో గాయలపాలౌతూ బతికేస్తున్నాం. నీ జ్ఞాపకాలే మా గాయాలకు మందులు. నిన్ను తలచినప్పుడల్లా గుర్తొచ్చేది నీ చెరగని చిరునవ్వు. ప్రేమాస్పదమైన నీ పిలుపు. నీ పేరు పలికితేనే కొండంత భరోసా. నీవు అభివృద్ధికి చిరునామా. నాయకత్వానికి నిలువెత్తు నిదర్శనం. ప్రజసంక్షేమానికి నీవే నిండైన ప్రతిరూపం. మాకోసమే అనుక్షణం తపించావు. ఆఖరి క్షణాన కూడా మా వద్దకే పయినించావు. నిన్ను స్మరించుకోవడం అంటే మా సంతోషాల స్వర్ణయుగాన్ని మరోసారి గుర్తుకు తెచ్చుకోవడమే రాజన్నా. 

  • ఆకుపచ్చని సూర్యుడవై రైతులకు వెలుగులు పంచావు
  • అపర భగీరధుడివై జల యజ్ఞం సాగించావు.
  • హరితాంధ్ర కలను సాకారం చేసావు.
  • ఆరోగ్యశ్రీతో ప్రాణాలను పోశావు
  • ఫీజు రీయింబర్స్ మెంట్ తో పేదపిల్లలను చదివించావు
  • పావలా ప్రభంజనంతో ఆడపడుచులను లక్షాధికారులను చేసావు. 
  • కిలో రెండు రూపాయిల బియ్యంతో పేదల ఆకలి తీర్చావు.
  • పనికి హామీ ఇచ్చి బతుకు ధీమా పంచావు.
  • ఎదిగిన కొద్దీ ఒదగమనే నీ నైజం, ప్రతి తెలుగువాడి ముఖాన చిరునవ్వు చూడాలన్నది నీ ఆశయం. 
  • ప్రజల మనసెరిగి మసలిన మహా నేతవు. పాలన అంటే ప్రజలకు దగ్గరగా ఉండేదే కాని, దగా చేసేది కాదని నిరూపించావు. జగమంత కుటుంబం నీది. నీ రుణం మేమెన్నటికీ తీర్చుకోలేనిది. 
  • ఎన్నికలంటే పచ్చనోట్లు, ప్రలోభాలు, బలవంతాలు, బెదిరింపులౌతున్నవేళ…. రాష్ట్రం రావణ కాష్టంలా రగులుతోంది. 
  • ఇలాంటి సమయంలో నీ తలపే మాకో శక్తి. ధర్మాన్ని గెలిపించేలా, మంచితనానికి పట్టం కట్టేలా మాకు బలాన్ని ఇవ్వు రాజన్నా. నీవు మా హృదయాల్లో నిలిచి ఉన్నావని నిరూపించుకునే అవకాశమివ్వు. 
  • కరిగిపోయే కాలం వెంట చెరిగిపోని నీ చిరునవ్వు సాక్షిగా రాజన్న రాజ్యాన్ని సాధించుకోవడమే మా తెలుగు ప్రజలు నీకిచ్చే నిజమైన నివాళి. 

Back to Top