ఉత్సాహంగా వైయ‌స్ఆర్ కుటుంబం

పెదబయలు:

వైయ‌స్ఆర్ సీపీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పిలుపు మేర‌కు మండ‌లంలో ఉత్సాహంగా వైయ‌స్ఆర్ కుటుంబం కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తున్నారు. పెదబయలు మండలంలోని గలగండ పంచాయతీ మంగబందలో యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి చెట్టి విజయ్‌ ఆధ్వర్యంలో శనివారం వైయ‌స్ఆర్‌ కుటుంబం కార్యక్రమం నిర్వహించారు. బూత్‌ స్థాయి కమిటీ కన్వీనర్‌ కిల్లో సిద్ధేశ్వరరావుతో పాటు నాయకులు ఇంటింటికీ వెళ్లి 91210 91210 నంబ‌ర్‌కు మిస్‌డ్ కాల్ ఇప్పించి వైయ‌స్ఆర్‌ కుటుంబంలో చేర్చుతున్నారు. కార్య‌క్ర‌మంలో నాయకులు కొర్రా బాబూరావు, కొర్రా బాలరాజు, కృష్ణారావు పాల్గొన్నారు.

తాజా ఫోటోలు

Back to Top