వైయస్సార్‌ కుటుంబంలో భాగస్వాములు అవుదాం..పూర్వ వైభవం పొందుదాం

–ఇంటింటికి వైయస్సార్‌ కుటుంబం కార్యక్రమానికి విశేష ఆదరణ
–మా దేవుడి స్టిక్కర్‌ను తొలగించమనే పథకాలు మాకొద్దు
–జగనన్నతో తిరిగి వైయస్సార్‌ పాలన–భూమన కరుణాకరరెడ్డి

తిరుపతి మంగళం: ఏమి తల్లి బాగున్నావా.. వైయస్సార్‌ గుర్తున్నారా..వైయస్సార్‌ పాలనలో సంక్షేమ పథకాలు ఏవైనా లభ్దిపొందారా..లబ్దిపొంది ఉంటే తిరిగి వైయస్సార్‌ పాలన కోరుకుంటున్నారా..కోరుకుంటుంటే వైయస్సార్‌ కుటుంబంలో భాగస్వాములు అవుతారా..అంటూ వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి ఇంటింటికి వెళ్లి కూర్చొని వారిని ఆప్యాయంగా పలకరించారు. వైయస్సార్‌ పాలన ఎలా ఉండేది..ప్రస్తుత చంద్రబాబునాయుడు పాలన ఎలా ఉంది తల్లీ అంటూ ప్రశ్నించారు.ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీల్లో ఏవైనా నెరవేర్చారా తల్లీ.. తాను అధికారంలోకి రాగానే మీకు ఇల్లు ఇస్తానన్నాడే ఇచ్చాడా..మీ బిడ్డకు ఉద్యోగం ఇచ్చాడా..డ్వాక్రా రుణాలు మాఫీ చేశాడా..మీ పిల్లలు పెద్ద చదవులు చదువుకోవడానికి ఫీజు రియంబర్స్‌మెంట్‌ ఇస్తున్నాడా.. ఇలా ఆరువందల హామీలు ఇచ్చాడే అందులో ఏవైనా నెరవేర్చాడా తల్లీ అంటూ స్థానిక మహిళలను ప్రశ్నించారు. దాంతో ఒక్కసారిగా ఆ పనికిమాలినోడు చంద్రబాబు మాట ఎత్తకండి సార్‌. మూడన్నరేళ్ల కాలంలో ఏమి ఉద్దరించాడు..నిరంతరం పేదల సంక్షేమమే లక్ష్యంగా తపిస్తూ తన ప్రాణాలను సైతం అర్పించిన మహానుభావుడు వైయస్‌.రాజశేఖర్‌రెడ్డి ఎక్కడ..అధికార దాహంతో నోటికి వచ్చిన అబద్ధాలు చెప్పి గుడిని గుల్లో లింగాన్ని మింగేసే చంద్రబాబు ఎక్కడ అంటూ చంద్రబాబు పాలనపై మహిళలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మేము ఎప్పుడూ వైయస్సార్‌ కుటుంబ సభ్యులమే. ఆ నాడు ఆ దేవుడు అందించిన రేషన్‌కార్డులు, పెన్షన్లు, ఆరోగ్యశ్రీ, ఫీజురియంబర్స్‌మెంట్, ఇందిరమ్మ ఇల్లు, పావలా వడ్డీ రుణాలు వంటి సంక్షేమ పథకాలతో ఎంతో లబ్దిపొందామని ఆనందాన్ని వ్యక్తం చేశారు. వైయస్సార్‌ మా గుండెల్లో ఉన్నాడని, ఇంటికి ఆయన బొమ్మ ఉన్న స్టిక్కర్‌ను అంటిస్తే వద్దంటామా అన్నారు. తమ ఇంటికి వైయస్సార్‌ స్టిక్కర్‌ ఉందని, మీకు ప్రభుత్వ పథకాలు తొలగిస్తామని ఎవ్వరైనా టిడిపి నాయకులు అంటే వైయస్సార్‌ స్టిక్కర్‌ను తొలగించి ఇచ్చే ఆ పథకాలే మాకొద్దు సార్‌ అంటూ వైయస్సార్‌ కుటుంబంలో భాగస్వాములైన ప్రజలు ముక్తకంఠంగా చెప్పారు.

ఈ సందర్బంగా కరుణాకరరెడ్డి మాట్లాడుతూ... దివంగత నేత డాక్టర్‌ వైయస్‌.రాజశేఖర్‌రెడ్డి అందించిన సంక్షేమ పథకాలను తిరిగి ప్రజలకు అందించగల ఏకైక నాయకుడు వైయస్‌.జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమేనన్నారు. తండ్రి ఆశయసాధన కోసం నవరత్నాలాంటి తొమ్మిది సంక్షేమ పథకాలు వైయస్సార్‌ రైతు భరోసాతో ప్రతి రైతుకూ రూ.50వేలు, డ్వాక్ర అక్కచెల్లెమ్మలకు పొదుపు సంఘాల ద్వారా రూ.15వేల కోట్లతో వైయస్సార్‌ ఆసరా, పెన్షన్లు రూ.వెయ్యి నుంచి రూ.2వేలుకు పెంపు, అమ్మఒడి..పేదల చదువుల బడి ద్వారా బడికి వెళ్లే ప్రతి పిల్లవాడికి నెలకు రూ.500చొప్పున తల్లి చేతికి ఇచ్చేలా అమ్మ ఒడి పథకం, ప్రతి పేదవాడికి ఇల్లు ఐదేళ్లలో 25లక్షల పక్కా ఇల్లు, ఆరోగ్యంగా ఆరోగ్యశ్రీ మళ్లీ వైయస్సార్‌ పూర్వ వైభవం, పూర్తి ఫీజురియంబర్స్‌మెంట్, యుద్ద ప్రాతిపదికన జలయజ్ఞనం ప్రాజెక్టుల పూర్తి, కుటుంబ ఆప్యాయతను పెంచేలా మూడు దశల్లో మద్య నిషేదం వంటి సంక్షేమ పథకాలను ప్రజల ఆశీర్వాదంతో జగనన్న అధికారంలోకి రాగానే అందిస్తారన్నారు. నగరంలోని 256పోలింగ్‌ బూత్‌ల పరిధిలోని ప్రతి ఇంటింటికి తమ పార్టీ నాయకులు, కార్యకర్తలు, బూత్‌కమిటీ ఇన్‌చార్జ్‌లు వెళ్లి ప్రజల అనుమతితో వారికి ఇష్టమైతే వైయస్సార్‌ కుటుంబంలో భాగస్వాములు చేయడం జరుగుతోందన్నారు. అయితే నగర ప్రజలు వైయస్సార్‌ కుటుంబంలో భాగస్వాములు కావడానికి ఆసక్తి చూపుతున్నారని, దాంతో వైయస్సార్‌ కుటుంబం కార్యక్రమానికి మంచి ఆదరణ లబిస్తోందన్నారు. అంతకు ముందు నగరంలోని ప్రతి డివిజన్‌కు కరుణాకరరెడ్డితో పాటు యువనాయకుడు భూమన అభినయ్‌రెడ్డి, పార్టీ నగర అధ్యక్షులు పాలగిరి ప్రతాప్‌రెడ్డి, పార్టీ సీనియర్‌ నాయకులు దొడ్డారెడ్డి సిద్దారెడ్డి వెళ్లి ఇంటింటికి వైయస్సార్‌ కుటుంబం కార్యక్రమాన్ని ప్రారంభించి ఆ డివిజన్‌లలోని ఒకోక్క ఇంటికి వెళ్లి ప్రజలతో 15నిమిషాల పాటు వారి సాధక బాధలు విని మీ కుటుంబానికి వైఎస్సార్‌ కుటుంబం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

Back to Top