"వైయస్ఆర్ కుటుంబం" కార్యక్రమం గడువు పొడిగింపు

హైదరాబాద్ః వైయస్ఆర్ కుటుంబం కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. విశేష ఆదరణను గమనించిన పార్టీ వైయస్ఆర్ కుటుంబం కార్యక్రమం గడువు పొడిగించింది. లక్ష్యాన్ని కోటి కుటుంబాలకు పెంచింది. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి వేణుంబాక విజయసాయిరెడ్డి రాష్ట్రంలోని అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలకు ఒక సర్క్యులర్‌ను పంపారు. ఈ సమాచారాన్ని జిల్లా పార్టీ అధ్యక్షులకు, జిల్లా పరిశీలకులకు కూడా పంపారు. వైయస్సార్‌ కుటుంబం కార్యక్రమంపై నవంబర్‌ 1వ తేదీన సమీక్షించి తదుపరి కొన్ని సూచనలు చేస్తామని కూడా ఆయన తెలిపారు. మరోవైపు, పాదయాత్ర ఏర్పాట్లు, భవిష్యత్ కార్యాచరణపై అధినేత వైయస్ జగన్ పార్టీ నేతలతో కీలక సమావేశం ఏర్పాటు చేశారు.

Back to Top