జగమంత కుటుంబంగా చేద్దాం

– వైయస్సార్‌ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి
తిరుపతి మంగళం: నిరంతరం ప్రజల సంక్షేమమే తమ ఊపిరిగా భావిస్తున్న వైయస్సార్‌ కుటుంబంలో ప్రతి ఒక్కరినీ భాగస్వాములుగా చేసి వైయస్సార్‌ కుటుంబాన్ని జగమంత కుటుంబంగా చేద్దామని వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు, బూత్‌కమిటీ ఇన్‌చార్జ్‌లకు సూచించారు. తిరుపతి నగరంలోని 256పోలింగ్‌ బూత్‌లలో బూత్‌ కమిటీ ఇన్‌చార్జ్‌లు నిర్వహిస్తున్న ఇంటింటికి వైయస్సార్‌ కుటుంబం కార్యక్రమంలో బుధవారం ఆయన పాల్గొని ప్రజలతో మమేకమై వారి సాధకబాధలను తెలుసుకుని, జగనన్న అధికారంలోకి వస్తే జరిగే మేలును వారికి క్షుణ్ణంగా వివరించారు. ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ వైయస్సార్‌ చేసిన మేలు, జగనన్న వస్తే చేసే సంక్షేమంపై వివరించి వైయస్సార్‌ కుటుంబంలో భాగస్వాములుగా చేశారు. కరుణాకరరెడ్డి మాట్లాడుతూ మహానుభావుడు వైయస్‌.రాజశేఖర్‌రెడ్డి చేసిన మేలు ప్రజలు మరవకుండా ఆయన్ను గుండెల్లో పెట్టుకుని పూజిస్తున్నారన్నారు. ఇంటింటికి వెళ్లి వైయస్సార్‌ కుటుంబంలో సభ్యులుగా చేరుతారా?అని అడిగితే అంతకన్నా భాగ్యం మరొకటి ఉందా అంటూ ఆనందంగా వైయస్సార్‌ కుటుంబంలో సభ్యులుగా చేరడం అభినందనీయమన్నారు. చంద్రబాబు లాంటి మోసగాడికి బుద్ధి చెప్పి జగనన్నను ఆదరిస్తే రాష్ట్ర అభివృద్ధితో పాటు ప్రజలంతా సంక్షేమంగా ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షులు పాలగిరి ప్రతాప్‌రెడ్డి, దొడ్డారెడ్డి సిద్దారెడ్డి, ఎస్‌కె.బాబు పాల్గొన్నారు.

తాజా ఫోటోలు

Back to Top